14.7 C
Munich
Tuesday, July 28, 2026

BRS Party : బిఆర్ఎస్ లో గుప్పుమన్న అసంతృప్తి ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

BRS Party : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు ఎందరో నాయకులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగారు. అధికారం చేపట్టిన పదేళ్లలో ఎందరికో పదవులు దక్కాయి. అధికారం ఉన్నన్నినాళ్ళు కొందరు పదవులకు నోచుకోలేదు.పదవులు రాని వాళ్ళల్లో కొందరు ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తికి లోనయ్యారు. ఇప్పుడు అధికారం పోయింది. రాజకీయ నిరుద్యోగం ఏర్పడింది. అధికారం పోవడంతో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీ లు గులాబీ గూడు వదిలిపెట్టి కాంగ్రెస్ గడప తొక్కుతున్నారు.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పై కొందరు అసంతృప్తికి లోనయ్యారు. అదికాస్తా ఇప్పుడు చెవులు కొరుక్కునే వరకు వెళ్ళింది. పదేళ్ళపాటు పదవులు కేసీఆర్ కుటుంబ సభ్యులే అనుభవించారు. అధికారంలో ఉన్న‌న్ని రోజులు కీల‌క‌మైన ప‌ద‌వులు, అధికారాలు కేసీఆర్ కుటుంబ సభ్యులే అనుభవించారు. పార్టీ ప్రతిపక్ష భాద్యతలను మోస్తోంది. ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ కి రావలసిన పదవులు వస్తే అవి కూడా కేసీఆర్ కుటుంబానికే చెందాలా అని కొందరు అసంతృప్తితో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి పీఏసీ చైర్మ‌న్ నియామకం చేప్పట్టబోతోంది ప్రభుత్వం. ప్రతిపక్ష పార్టీ కి చెందిన ఎమ్మెల్యేకు చైర్మన్ గ అవకాశం ఉంటుంది. చైర్మన్ నియామకం అయిన తరువాత ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీని నిర్మిస్తారు. ఇప్పుడు పీఏసీ చైర్మన్ పదవిని ఎవరికి ఇస్తారు అనేది బిఆర్ఎస్ లో చర్చనీయాంశం అయ్యింది. ఈ పదవిపై సీనియర్ ఎమ్మెల్యేలు ఆశతో ఉన్నారు. కనీసం అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ళపాటు ఎమ్మెల్యే పదవితోనే సరిపెట్టుకున్నాం. ప్రతిపక్షములో అయినా కనీసం పీఏసీ పదవి అయినా దక్కుతుందా లేదా అని అనుమానపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావుకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలని అధినేత నిర్ణయానికి వచ్చినట్టు బిఆర్ఎస్ శ్రేణుల సమాచారం. ఈ సమాచారం కాస్త బయటకు పొక్కడంతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల శిబిరంలో అసంతృత్తి ఒక్కసారిగా గుప్పుమంది. ఈ అసంతృప్తి పార్టీలో ఎటువైపు దారితీస్తుందో అని గుసగుసలు మొదలైనాయి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.