24.4 C
Munich
Sunday, July 26, 2026

PLASTIC BAN : ఆ దేవాలయంలో శాశ్వతంగా ప్లాస్టిక్ నిషేధం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

PLASTIC BAN : ప్లాస్టిక్ వాడకం అనేది నిత్య జీవితంలో తప్పనిసరి అయ్యింది. కానీ అది ఇంటి అవసరాలకే పరిమితం కాకుండా వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా ఉపయోగించడం తప్పనిసరి అయ్యింది. ప్లాస్టిక్ వాడకం కూడా దేవాలయాల్లో తప్పనిసరి అయ్యింది. భక్తులు ఆలయాల్లో తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. కానీ ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులు వినియోగించిన ప్లాస్టిక్ ను తొలగించడం ఆలయ సిబ్బందికి సాధ్యం కాలేదు. ఏ ఆలయం వద్ద చూసిన ప్లాస్టిక్ పేరుకు పోవడం, దాన్ని సిబ్బంది తొలగించడం వెంట, వెంటనే మళ్ళీ ప్లాస్టిక్ తయారయ్యేది. దీన్ని అరికట్టడానికి ముందుగా ప్రధాన దేవాలయం ముందుకు వచ్చింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయడానికి ఆలయం అధికారులు ముందుకు వచ్చారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో వెంకన్న సన్నిధిలో నూటికి నూరు శాతం ప్లాస్టిక్ నిషేధం అమలవుతోంది.

ఇటీవలనే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం అధికారులు కూడా ప్లాస్టిక్ నిషేధం పై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడ కూడా విపరీతంగా ప్లాస్టిక్ వాడకం జరిగింది. భక్తులు, వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడుతున్నారు. వాడి పడేసిన ప్లాస్టిక్ ను తొలగించడం ఆలయ సిబ్బందితో సాధ్యం కాలేదు. తొలగించినా మల్లి తయారై ఆలయ ప్రాంగణం అపరిశుభ్రంగా తయారయ్యేది. ఎట్టకేలకు ఆలయ అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ప్లాస్టిక్ నిషేధం విజయవంతం అయ్యింది.

తాజాగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కూడా శాశ్వతంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గుట్టపై ఉన్న ఆలయ ప్రాంగణంలో భక్తులు, వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడరాదంటూ శనివారం ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు, దేవాలయం కు సంబందించిన అన్ని విభాగాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ భాస్కర్ రావ్ ఉత్తర్వులు జారీ చేసారు.

 

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.