NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

BRS Place : పార్లమెంట్ ఎన్నికల్లో BRS స్థానం ఎంత

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

BRS Place : తెలంగాణ ఉద్యమం పేరుతో గులాబీ పార్టీ రాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేపట్టింది. ముచ్చటగా మూడోసారి అధికారం చేపడుతానని ఉవ్విళ్ళు ఊరింది. అధికారం కోసం పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. అధికారం చేజారి పోయింది. నాయకులు కూడా జారిపోతున్నారు. పార్టీ పీకల్లోతూ కష్టాల్లోకి వెళ్ళింది. పార్టీ గుర్తు పై గెలిచిన వారు, ఓటమిపాలైన వారు కూడా ఏ పార్టీ కండువా కప్పుకుంటున్నారో ఊహించలేకపొతున్నారు అధినేత కేసీఆర్. వద్దన్నా వినే పరిస్థితి కనబడటంలేదు.

ఇంతలో పార్లమెంట్ ఎన్నికల గంట మోగింది. ఇప్పుడయినా పార్టీ ని కాపాడుకోవాలని అధినేత కేసీఆర్ ప్రయత్నాలు చేశారు.17 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపారు. కూతురు జైలు కు వెళ్లడం పార్టీ కి పెద్ద . బస్సు యాత్ర చేపట్టారు. మరోవైపు కొడుకు, అల్లుడు ప్రచారం చేశారు అభ్యర్థుల తరపున. పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి కేసీఆర్ కుటుంబం దూరంగ ఉండటంతో రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేసింది.

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 62 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 10 పార్లమెంట్ స్థానాల్లో 70 శాతం పోలింగ్ నమోదయినది. ఈ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం కొంత మెరుగయినది. ఎన్నికల సమయం ఆసన్నమయ్యేనాటికి కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ ల మధ్యనే పోటీ ఉంటదని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ పోలింగ్ రోజున ఓటరు పరిస్థితిని గమనిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే గట్టి పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. రెండు పార్టీల పోటీని పరిశీలిస్తే బిఆర్ఎస్ ప్రజలకు దూరమైనట్టేననే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ మల్లి అందలం ఎక్కాలంటే కష్టమే అవుతుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నిరుద్యోగుల్లో పలువురికి గులాబీ గూటిలో ఉపాధి దొరికింది. అధికారం దూరం కావడంతో బిఆర్ఎస్ లో ఉన్నవారంతా రాజకీయ నిరుద్యోగులు అయ్యారు. ఇప్పుడు వారంతా కూడా ఉపాధి కోసం కండువాలు మార్చుతున్నారు. శ్రేణులు జారిపోకుండా ఉండేందుకు, అభ్యర్థులు విజయం సాధించడానికి అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. బస్సు యాత్ర చేపట్టారు. పోలింగ్ పరిస్థితి గమనిస్తే మాత్రం మూడో స్థానం, మరి కొన్ని స్థానాల్లో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయం పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ రెండు పార్టీలే ఓట్లను షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పల్లె ప్రాంతాల్లో కాంగ్రెస్ ను ఓటర్లు ఆదరించారు. కాని పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి గ్రామాల్లో కూడా కమలం వికసించినట్టు తెలుస్తోంది. రెండు జాతీయ పార్టీలే పార్లమెంట్ ఎన్నికల్లో కుస్తీ పడినట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ లో మాత్రమే ఎంఐఎం , బీజేపీ మధ్యనే పోటీ ఉండగా, మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోరు నడిచిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్రంలో పోలైన ఓట్ల శాతం, ఓటరు నాడీ ని గమనిస్తే జూన్ నాలుగున వచ్చే ఫలితాల్లో బిఆర్ఎస్ విజయానికి దూరంగా ఉండే పరిస్థితి కనబడుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలే చెరి సగం పంచుకోనున్నట్టు కొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి. 17 స్థానాల్లో హైదరాబాద్ స్థానాన్ని మాత్రం ఎంఐఎం దక్కించుకునే అవకాశం కనబడుతోంది. జూన్ నాలుగున ఇవే ఫలితాలు కనబడితే బిఆర్ఎస్ కోలుకోవడం కష్టమే అవుతుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.