NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

BJP Mejority : మోదీ 400 అడుగులు నడిచేనా ???

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

BJP Mejority : ఏడు దశల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరపడానికి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకొంది. నాలుగు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ ఒకటో తేదీ తో ఎన్నికలు పూర్తిగా ముగియనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతున్నాయి. బీజేపీ గ్రాఫ్ పడిపోయిందా ?. అనుకున్న లక్ష్యం చేరుకోవడం కష్టమేనా ? ఇప్పటివరకు జరిగిన పోలింగ్ లో వెనుకబడిందా ? తక్కువ శాతం నమోదు కావడం సంకేతం దేనికి చూపుతోంది. ? రాజకీయ గణాంకాలు చెప్పే మేధావుల్లో ఆయా అంశాలపై చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది బీజేపీ. తాజా ఎన్నికల్లో వెనుకబడిపోయినట్టుగా ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. అంతేకాదు బీజేపీ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి కూడా కబడుటలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సొంతంగా వేద్దామనుకున్న 400 అడుగులు కూడా వేయలేకపోతున్నదనే మాటలు వినబడుతున్నాయి. కనీసం పార్టీ గుర్తుపై 370, మిత్రులతో కలిసి 400 స్థానాల్లో గెలవాలనే ఆలోచనలో ఉంది. అది కూడా అంత సులభమయ్యే పరిస్థితి కనబడుటలేదు.

నాలుగు వందల స్థానాల్లో కాషాయం పథకాన్ని ఎగురవేయాలని బీజేపీ పెద్దలు విస్తృత ప్రచారం చేశారు. సొంత జెండా పై 400 అడుగులు వేయలేమని తేలిపోయింది. దింతో కాషాయం దళంలో గుబులు మొదలైనది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ పార్టీ ఆశించిన మేరకు నమోదు కాలేదు. ప్రస్తుతం నమోదయిన ఓట్ల శాతం ఆందోళనకు గురిచేస్తోంది. మొదటిసారి ఏప్రిల్ 19 న జరిగిన ఎన్నికలకు, 2019 ఎన్నికల గణాంకాలను చూసుకుంటే తక్కువ నమోదయినది. ఏప్రిల్ 26న జరిగిన రెండో దశ పోలింగ్ కూడా గతంలో కంటే మూడు శాతం తక్కువగానే అయ్యిందని గణాంకాలు చెబుతున్నాయి. మూడో విడితలో 1.2 శాతం, నాలుగో దశలో 2.3 శాతం ఓటింగ్ తక్కువగా నమోదు కావడంతో కమలనాదుల్లో ఆందోళన మొదలైనది. ఈ గణాంకాల ప్రకారం మోదీ గ్రాఫ్ పడిపోయిందనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.

కాశ్మిర్ అంశాన్ని మాత్రమే బీజేపీ పెద్దలు ఎక్కడికి వెళ్లినా గొప్పగా చెప్పుకుంటున్నారు. అంత గొప్పగా చెప్పుకోడానికి అవకాశం ఉన్న కాశ్మిర్ లో పోటీచేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆశ్చర్యం కూడా వ్యక్తమవుతోంది. ఆ ప్రాంతం నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీలో లేకపోవడం కూడా 2024 ఎన్నికల చరిత్రలో నిలిచిపోతున్నది. సొంతంగా మూడోసారి ఢిల్లీ పీఠం దక్కాలంటే 272 మంది అభ్యర్థులు తాజా ఎన్నికల్లో ముందువరుసలో నిలబడాలి. ఇది సాధ్యం కాని నేపథ్యంలో మిత్రుల సహాయం తప్పనిసరి అవుతుందని రాజకీయ పండితులు సూటిగానే చెబుతున్నారు. రాజకీయ నాయకుల గణాంకాలు కమలనాదుల్లో కలకలం రేపుతున్నాయి. మిగిలిన మరో మూడు దశల్లో జరిగే పోలింగ్ శాతం ఆశించిన దానికంటే ఎక్కువ నమోదయితేనే బీజేపీ పెద్దల ఢిల్లీ పీఠం లక్ష్యం నెరవేరుతుంది.

 

 

 

 

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.