22 C
Munich
Monday, July 27, 2026

Three Members : తెలంగాణలో ముగ్గురు ఎంపీ అభ్యర్థులు ఓటు వేయలే

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Three Members : తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. చెప్పుకోదగిన స్థాయిలో సంఘటనలు ఎక్కడ కూడా జరుగలేదు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు సోమవారం పూర్తయ్యాయి. 17 స్థానాల ఫలితాలు జూన్ నాలుగున వెల్లడి కానున్నాయి. 17 స్థానాల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఎంపీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న నాయకులు సహజంగా తమ సొంత నియోజకవర్గం కేంద్రాల్లోనే ఓటు వేస్తారు. కానీ బరిలో ఉన్న బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మాత్రం చాలా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఢిల్లీ లో అడుగుపెట్టాలనుకున్న ముగ్గురు నాయకులు తమ ఓటును తామే వేసుకోలేని సంఘటన ఎదురుకావడం విశేషం.

కాంగ్రెస్ అభ్యర్థిగా మల్కాజిగిరి స్థానం నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈమెకు ఓటు హక్కు తాండూర్ అసెంబ్లీ పరిధిలో ఉంది. తాండూర్ అసెంబ్లీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉండటం విశేషం. సునీత మహేందర్ రెడ్డి తన ఓటు తాను వేసుకోలేకపోయారు.

హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీ లత తమ సొంత నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. అభ్యర్థి మాధవీ లత నివాసం ఈస్ట్​ మారేడుపల్లిలో మహేంద్రహిల్స్​లో ఉంది. దింతో ఆమె ఓటు మల్కాజిగిరి నియోజకవర్గంలోకి వస్తుంది. కాబట్టి ఆమె తన ఓటును సద్వినియోగం చేసుకోలేక పోయారు.

ఎంఐఎం అభ్యర్థిగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఓవైసీ కూడా ఓటు వేయలేకపోయారు. ఓవైసీ సొంత ఇల్లు రాజేంద్రనగర్ పరిధిలో ఉన్నది. ఓవైసీ ఉంటున్న నివాసం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉంది. కాబట్టి ఓవైసీ కూడా ఓటువేయలేకపోయారు.

 

 

 

 

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.