22 C
Munich
Monday, July 27, 2026

CM Jagan : జగన్ మళ్లీ సీఎం అయితే ఆ ముగ్గురికి కష్టాలే…

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

CM Jagan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో అవినీతి పాలనను అంతమొందించడానికి తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపారు. అక్కడితో ఆగకుండా ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ తో జత కట్టి కూటమిగా ఏర్పడ్డారు. కానీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం ఒంటరి పోరాటం చేస్తున్నారు. రెండోసారి అధికారం చేపట్టాలని కంకణం కట్టుకున్నారు. మొన్నటివరకు కేంద్రం మద్దతు తో తిరుగులేని నాయకునిగా ఉన్న జగన్ ఎన్నికల నాటికి ఒక్కడైనారు. 2019 ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా జగన్ సాధారణ మెజార్టీ తో అధికారం చేపడితే ఆ ముగ్గురికి కష్టాలు తప్పవనే అభిప్రాయాలూ రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.

తాజా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాణి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దాదాపుగా ఇవే చివరి ఎన్నికలు అవుతాయి. ఇప్పటికే పార్టీ శ్రేణులు ఆర్థికంగా నష్టపోయారు. జగన్ పరిపాలనతో ఇక్కట్లను ఎదుర్కోవాలి వచ్చింది. పోలీస్ కేసులతో నస్టపోయారు. కింది స్థాయి నాయకులు సైతం దూరమైపోయారు. ఇప్పుడు పోటీచేస్తున్న వారంతా కూడా అత్తెసరు నాయకత్వంతో బరిలోకి దిగారు. క్యాడర్ లేక టీడీపీ అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు అధికారం రానినేపథ్యంలో పార్టీ శ్రేణులను పోషించడం కష్టమవుతుంది. ఇప్పటికే ఐదేళ్లపాటు కాపాడుకున్నారు. మరో ఐదేళ్లు అంటే చాల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఐదేళ్ల అధికారంలో వార్డు స్థాయి నుంచి మొదలుకొని నియోజకవర్గం వరకు నాయకులపై మోపిన అక్రమ కేసులతో ఆర్థికంగా,మానసికంగా ఎంతో నష్టపోయారు. మరో ఐదేళ్లు అధికారంలో లేకుంటే పార్టీ బతికి బట్ట కట్టడం కష్టమనే అభిప్రాయాలు సైతం పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తం కావడం విశేషం. తాజా ఎన్నికల్లో అధికారం చేపట్టకపోతే టీడీపీ కి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని, పోటీ చేయడానికి అభ్యర్థులు సైతం కరువవుతారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇది ఇలా ఉండగా ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావు కూడా ఇబ్బందులను ఎదుర్కొవలసి ఉంటది. గడిచిన ఐదేళ్ల కాలంలో ఈనాడుకు అడ్వటైజ్మెంట్ యాడ్స్ ఇవ్వడం లేదు. ఇచ్చిన వాటికి బిల్లులు మంజూరు చేయకుండా జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అంతే కాదు ఆయన ప్రింటింగ్ ఎడిషన్ భవనాల స్థలాలపై కూడా ఇబ్బందులకు గురిచేసింది వైసిపి ప్రభుత్వం. అక్కడితో ఆగకుండా అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఈనాడు పత్రిక సర్క్యులేషన్ ను తగ్గించి, దాని స్థానంలో జగన్ ఇంటి పత్రిక ” సాక్షి ” ని పెంచే విదంగా జగన్ ప్రభుత్వం వెంటపడుతుంది. మార్గదర్శి చిట్ ఫండ్ వెంబడి ఇంకా పడుతూనే ఉంది జగన్ ప్రభుత్వం. రామోజీరావుకు మాజీ సీఎం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా నిప్పు, ఉప్పు మాదిరిగానే ఉండేది. ఇప్పుడు కూడా అదే సంప్రదాయం కొనసాగుతోంది. మరోసారి జగన్ అధికారం చేపడితే పత్రిక పరంగా, చిట్ ఫండ్ పరంగా ఆయనతో రామోజీ రావ్ న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంటది.

అదేవిదంగా ఆంధ్ర జ్యోతి దినపత్రిక కు సైతం జగన్ ప్రభుత్వం మరోసారి ఏర్పడితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే పత్రికకు అడ్వటైజ్మెంట్ యాడ్స్ సరిగా ఇవ్వడంలేదు. ఇచ్చిన వాటికీ సకాలంలో బిల్లులు మంజూరు కావడంలేదు. ఈవిదంగా ఆ పత్రికను సైతం ఆర్థికంగా గడిచిన ఐదేళ్ల నుంచి దెబ్బకొడుతూనే ఉంది వైసీపీ ప్రభుత్వం. అంతే కాదు సర్క్యులేషన్ పరంగా కూడా ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పుడు మరోసారి జగన్ ఆంధ్ర ప్రదేశ్ పగ్గాలు చేతపడితే ఆంధ్ర జ్యోతి పత్రికకు సైతం కష్టాలు తప్పవు. అంతే కాదు ఆ పత్రిక సర్క్యులేషన్ తగ్గించి మరింత ఇబ్బదులకు గురిచేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర జ్యోతి, ఈనాడు దినపత్రికలు ఉండరాదు. కేవలం ఆయన సొంత పత్రిక మాత్రమే కొనసాగే విదంగా జగన్ ఆదేశాలు ఉంటాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.