22 C
Munich
Monday, July 27, 2026

అందుకే విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టారు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

junior NTR and NAANI : తెలుగు దేశం పార్టీ తాజా ఎన్నికల్లో కొత్త డైలాగు తెరమీదకు తీసుకు వచ్చింది. బాబు…రావాలి… జాబు రావాలి … అనే డైలాగుతో జనంలోకి వచ్చింది. గుడివాడ నియోజక వర్గంలో ఇటీవల ఎన్టీఆర్ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సమావేశంలో బాబు ఓడాలి … జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటూ నటుడు తారక్ అభిమానులు చేసిన నినాదాలు మిన్నంటాయి. ఒక్కసారిగా అక్కడ ఉన్న నాయకులంతా కూడా షాక్ అయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పాల్గొన్నారు. సమావేశంలో నాని మాట్లాడిన మాటలు, తారక్ అభిమానులు చేసిన నినాదాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

తాజా ఎన్నికల్లో తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడుని ఓడిస్తేనే పార్టీ భాద్యతలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి వస్తాయని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తోపాటు జూనియర్ ఎన్టీఆర్ నాకు రెండు కళ్ళతో సమానమని ప్రకటించడం విశేషం. ఒకవైపు జగన్ నా మనిషి అంటూనే మరోవైపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రక్త సంబంధమైన జూనియర్ ఎన్టీఆర్ కూడా నా మనిషే అనడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైనది. అదేవిదంగా తెలుగు దేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ను అణగదొక్కాలని లక్ష్యముగా పెట్టుకొందని తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇది తెలిసిన అయన అభిమానులు కూడా టీడీపీ అభ్యర్థులను ఓడించాడనికి సిద్దమయ్యారని నాని ప్రకటించారు. ఈ న నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ శిబిరంతో పాటు టీడీపీ శిబిరంలో రాజకీయ ప్రకంపనలు మొదలైనాయి.

మాజీ ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ అంటే నాకు ఎంతో అభిమానం ప్రేమ ఉన్నాయంటూ తన భక్తిని చాటుకున్నారు కొడాలి నాని. సీఎం జగన్ కు కూడా ఆ ముగ్గురు అంటే ఎంతో ఇస్తామంటూ తెరచాటుకున్న జగన్ ప్రేమాభిమానాన్ని చెప్పకనే చెప్పారు. సీఎం జగన్ కు, నాకు ఆ ముగ్గురు అభిమానం కాబట్టే విజయవాడ జిల్లా కు ఎన్టీఆర్ పేరు పెట్టామని చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకోడానికి నాని చేసిన ప్రసంగం ఏ మేరకు పనిచేస్తుందో వేచి చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొందరు టీడీపీ సమావేశానికి వెళితే ఆ పార్టీ నాయకులు వాళ్ళను ఎందుకు తరిమి కొట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అక్కటుకోడానికి ప్రయత్నం చేశారు. ఇంతకూ ఆ ఆత్మీయ సమావేశాన్ని కొడాలి నాని ఏర్పాటు చేశారా ?? లేదంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేశారా అనేది కూడా అనుమానంగానే ఉందని గుడివాడలో చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేని అభిమానుల సమావేశం ఇప్పుడే, ఇక్కడే ఎందుకు ఏర్పాటు చేశారంటూ గుడివాడలో గుసగుసలు మొదలైనాయి.

విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంలో నాకు, జగన్ కు ఉన్న అభిమానంతో అని చెప్పారు నాని. ఎన్టీఆర్ పేరు ప్రకటించినప్పుడు ఇప్పుడు చెప్పినట్టుగా అప్పుడే ఎందుకు చెప్పలేదని కూడా టీడీపీ నాయకులు కొందరు నాని ని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఎన్టీఆర్,హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల పై ప్రేమాభిమానాలు ఉంటె విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను పిలిచి జిల్లాకు వారి సమక్షములో ఎన్టీఆర్ పేరు ఎందుకు ప్రకటించలేదని కూడా గుడివాడ టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

తన గురువు హరికృష్ణ అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను తనవైపుకు తిప్పుకోడానికి సమావేశంలో ప్రయత్నించారు. అంతేకాదు ఎన్టీఆర్ కు భక్తుడిని అంటూ ఆయన కుటుంబ సభ్యులను, అభిమానులను అక్కటుకోడానికే నాని అభిమానుల పేరిట ఆత్మీయ సమ్మేళనం అంటూ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా నాని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

———————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
———————

 

 

 

 

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.