22 C
Munich
Monday, July 27, 2026

ఎంపీ సోయం బాపురావు పై సీఎం సానుభూతి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

CM REVANTH REDDY : భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పై సానుభూతి వ్యక్తం అవుతోంది. నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ఒక్క బాపురావు కే బీజేపీ పెద్దలు మరోసారి పోటీ చేయడానికి టికెట్ ఇవ్వలేదు. కాబట్టి జనంలో ఉంటె అంతో, ఇంతో సానుభూతి ఉండవచ్చు. కానీ ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రే సానుభూతి వ్యక్తం చేస్తున్నాడంటే మతలబు ఏమయి ఉండవచ్చు అనేది రాజకీయ వర్గాల మెదల్లో ప్రశ్న మొలకెత్తింది. ఆలా మొలకెత్తిన ప్రశ్నకు జవాబు దొరకడంలేదు. ఒకవేల ఎవరైతే సానుభూతి వ్యక్తం చేస్తున్నారో వాళ్లే జవాబు చెప్పాలి. ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , సిట్టింగ్ ఎంపీ సాయం బాపు రావుపై జాలి చూపడంటే చిన్న విషయం ఏ మాత్రం కాదు.

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, అంతే కాదు ఆదివాసీ ఉద్యమ నాయకుడు. గత పార్లమెంట్ ఎన్నికల నాటికీ ఉద్యమంలో అందరికంటే ముందున్న వ్యక్తి. రాజకీయ నాయకుల అంచనాలను తలకిందులు చేసి, బీజేపీ టికెట్ సాధించి ఆదిలాబాద్ గడ్డపై కాషాయం జెండా ఎగురవేసిన ఉద్యమ నాయకుడు సాయం బాపురావు. నలుగురు సిట్టింగ్ ఎంపీలలో ఒక్క బాపూరావునే ఢిల్లీ పెద్దలు కాదనడం రాజకీయ వర్గాలకు అంతుపట్టడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో ముందుండే సోయం, టికెట్ దక్కని నాటి నుంచి నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్లిపోయారు. బీజేపీ అభ్యర్థి ప్రచారానికి కూడా బాపురావు ఇంటి గడప దాటి రాకపోవడం శోచనీయం.

రాష్ట్ర అధికార పార్టీ చీఫ్,సీఎం రేవంత్ రెడ్డి ఎవరూ ఊహించని రీతిలో ప్రేమాభిమానాలు చూపించడంతో రాజకీయ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఎదో ఒకసారి సమయం, సందర్భం బట్టి అభిమానం, సానుభూతి చుపించాడంటే దానికో అర్థం ఉంటది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ పర్యటనకు వచ్చినా ప్రతిసారి ఎంపీ సాయం బాపూరావుపై సానుభూతి, ప్రేమ, అభిమానం వ్యక్తం చేయడంతోనే నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు మొదలైనాయి. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎంపీ పై అధికార పార్టీ ముఖ్య మంత్రి దయచూపడం ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు, వినలేదు అంటూ రాజకీయ వర్గాలు ముక్కున వేలేసు కుంటున్నాయి. ఇంతకు సోయం బాపూరావుకు, సీఎం రేవంత్ రెడ్డి కి ఉన్న సంబంధం ఏమిటి, సానుభూతి వెనుక దాగిఉన్న మతలబు ఏమిటి అంటూ పలువురు రాజకీయ నేతలు తలపట్టుకుంటున్నారు.

ఎంపీ సాయం బాపురావు ను సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినపుడు ఆకాశానికి ఎత్తడం జరుగుతోంది. ఆదివాసీ నాయకుడిగా విజయం సాధిస్తే, మోదీ కనీసం ఆయనకు గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కూడా మంజూరు చేయలేదన్నారు సీఎం. అదేవిదంగా అభివృద్ధికి ముందుకు వచ్చిన బాపూరావుకు మోదీ అడ్డుతగలడం ఎంతవరకు సమంజసమని సీఎం జిల్లా పర్యటనలో ప్రశ్నిస్తూ సానుభూతి వ్యక్తం చేయడం కనిపించింది.
————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
————————-

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.