NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

తెలంగాణాలో బీజేపీ గెలిచే స్థానాలు ఇవే ….

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

BJP :తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరెత్తినది. కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ఓటర్లను ఆకట్టుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తరుపున ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యకుడు నడ్డా రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ ముగ్గురు రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలను చుట్టేస్తున్నారు. అదేవిదంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి పార్టీ కి ఆయుస్సు పోయడానికి శాయశక్తులా కృషిచేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన వంద రోజుల పరిపాలనపై ఆధారపడి ప్రచారం చేస్తున్నారు. ఎలాగయినా కనీసం పది స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన పార్టీలకి దీటుగా ప్రచారం చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఆ మూడింటిలో మల్కాజిగిరి స్థానం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఇప్పడు ఆ స్థానం ను ఎలాగయినా దక్కించుకొని సీఎం రేవంత్ రెడ్డి పరువుకు బంగం కలిగించాలని జీజేపీ తోపాటు బిఆర్ఎస్ అక్కడ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. రేవంత్ రెడ్డి కూడా తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు.

బిఆర్ఎస్ గత ఎన్నికల్లో పది స్థానాల్లో విజయాన్ని సాధించింది. గులాబీ శ్రేణులు రెండు స్థానాలకే పరిమితం అవుతారని సర్వేలు చెబుతున్నాయి.మొన్నటివరకు మాజీ మంత్రులు హరీష్ రావ్, కేటీఆర్ లు అభ్యర్థుల గెలుపు కోసం పర్యటనలు చేశారు. కానీ పార్టీకి అనుకున్నంత మైలేజీ రాలేదు. కూతురు జైలు లో ఉన్న బాధతో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు.ఎట్టకేలకు పార్టీకి జీవం పోయడానికి బస్సు యాత్ర చేపట్టారు.

కాషాయ దళం గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విదంగా నిజామాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాల్లో జెండా ఎగురవేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 60 నుంచి 63 స్థానాలు సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని ఒక ప్రైవేట్ సంస్థ సర్వే చేపట్టి తెలిపింది. ఇప్పుడు అదే సంస్థ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సర్వే చేపట్టి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాదిస్తుందనేది ప్రకటించింది. ఈ ఫలితాల్లో బీజేపీ గతంలో సాధించిన స్థానాలతో పాటు మరికొన్ని స్థానాలను అదనంగా సాదిస్తుందని తెలిపింది. బీజేపీ అధనంగా గెలిచే స్థానాల్లో మహబూబ్ నగర్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్, భువనగిరి ఉన్నాయి. మిగతా ఏడు నుంచి ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆ ప్రైవేట్ సంస్థ తన సర్వేలో తెలిపింది. బిఆర్ఎస్ ఏ ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేదని ఆ సర్వే సంస్థ ప్రకటించింది.
————————–
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
————————–

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.