NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

మోదీ లక్ష్యం రెండు రాష్ట్రాలు …

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Narendra Modi : భారతీయ జనతా పార్టీకి ముగ్గురు నేతలు కీలకం. ఒకరు ప్రధాన మంత్రి మోడీ. మరొకరు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. ఇంకొకరు మంత్రి అమిత్ షా. మోదీ లక్ష్యం రెండు రాష్ట్రాలు. తెలంగాణ తోపాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. గతంలో ఎన్నడు లేని విదంగా మోదీ రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టు కుంటున్నారు.

మోదీ ఇప్పటికే తెలంగాణలో రెండుసార్లు ప్రచారం చేశారు. ఈ నెల 8,10 తేదీల్లో మరోసారి పర్యటనకు వస్తున్నారు. ఎనిమిదిన వేములవాడలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అదేరోజు వరంగల్ లోని మడికొండ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదే నెల 10న నారాయణ పేట, హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

తెలంగాణతోపాటు ఆంధ్ర ప్రదేశ్ పై కూడా మోదీ తనదయిన శైలిలో దృష్టి సారించారు. ఈ నెల 8న విజయవాడకు రానున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి మొదలుకొని బెంజ్ సర్కిల్ వరకు భారీ ఎత్తున రోడ్ షో కోసం అక్కడి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. అదేవిదంగా ఆరో తేదీన కూడా మోది పర్యటన ఆంధ్ర ప్రదేశ్లో ఉంటుందని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఆదేవిదంగా తిరుపతి,రాజంపేట,రాజమండ్రి,అనకాపల్లి ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారు.

అదేవిదంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 5న తెలంగాణలో పర్యటించనున్నారు. అమిత్ షా ఆసిఫాబాద్ జిల్లా లోని కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అదేరోజు నిజామాబాదు, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సభల్లో పాల్గొంటారు. పార్టీ అధ్యక్షుడు నడ్డా ఈనెల 6న పెద్దపల్లి, భువన గిరి, నల్గొండ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

గత ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క స్థానం నుంచి కూడ బీజేపీ అభర్ధులు పార్లమెంట్ కు వెళ్ళలేదు. అక్కడ పార్టీ అభివృద్ధి కోసం ఇటీవలనే రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించారు. ఆదేవిందంగా కనీసం ఒక్కరినైనా గెలిపంచుకోవాలనే ఆశతో జనసేన,తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకుంది బీజేపీ. తెలంగాణ లో గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో అభ్యర్థులు గెలిచారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో గెలుపొందారు. ఆ స్పూర్తితో కనీసం పదికి పైగా పార్లమెంట్ స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో పార్టీ పావులు కదుపుతోంది.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.