varahi god : అసలు వారాహి అంటే అర్థం ఏమిటి ? వారాహి దేవతకు పూజలు ఎలా చేస్తారు. ఆ దేవతకు పూజ చేస్తే ఎలాంటి ఫలితం చేకూరుతుంది……ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని నమ్ముకున్నారు. ఇప్పుడు ఆయన అమ్మవారి దీక్షలో ఉన్నారు. వారాహి అంటే భూదేవి అని అర్థం. హిరణ్యక్షుడు భూదేవిని తీసుకెళుతున్నప్పుడు మహా విష్ణువు వరాహ రూపంలో అడ్డుకుంటాడు. హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని కాపాడుతాడు. అందుకు కృతజ్ఞత తో అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని వేదంలో చెప్పబడింది. అందుకని భూదేవిని వరాహస్వామి స్త్రీ రూపమని పలు ధ్యాన శ్లోకాల్లో చెప్పబడింది.
వారాహి కి 12 నామాలు. ఆ నామాలు అత్యంత శక్తిమంతమైనవి. పంచమి, సమయ సంకేత, దండనాథా, వారాహీ, సంకేతా, పోత్రిణి, శివా, మహాసేన, వార్తాళి, అరిఘ్ని ఆజ్ఞా చక్రేశ్వరి అనే పేర్లతో పిలుస్తారు. ఈ పన్నెండు నామాలను రోజుకు ఒకసారి 11 సార్లు జపిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. లక్ష్మీ స్వరూపమైన వారాహి దేవి పై నమ్మకంతో ఈ మంత్రాన్ని నియమంతో జపించాలి. ఐమ్ క్లీమ్ సౌ అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21సార్లు జపించాలి. 31, 41, 51 సార్లు కూడా జపించవచ్చు. అమ్మవారి పూజ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపు మాత్రమే నిర్వహించాలి. ఇలా అమ్మవారిని జపించడం వలన ఆర్థిక, మానసిక, కుటుంబ సమస్యలు దాదాపుగా పరిస్కారం అవుతాయని వేదంలో చెప్పబడింది.
పూజ సమయంలో అమ్మవారి ఫోటో వద్ద కొంచెం గంధం, తెల్లని పూలు, సాంబ్రాణి దూపం పెట్టాలి. సాంబ్రాణి పొడిని కర్ర బొగ్గులు వెలిగించి దానిపై సాంబ్రాణి దూపం వేయండి. అగరబత్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగించరాదు. అమ్మవారికి మహాదీపంతో పాటు చిన్న దీపం కూడా వెలిగించవచ్చు. నైవేద్యం మాత్రం నల్లబెల్లం రెండు లవంగాలను వాడుకోవాలి. సింధూరం కలిపిన అక్షింతలను తయారు చేసి వేయాలి. నర దిష్టి, చెడు దిష్టి, ఎదుటివారి శాపం వంటి తగలకుండా ఉండేందుకు శుక్రవారం రోజు అష్టమి తిధి పంచమి నాడు అమ్మవారిని పూజించాలి. ఈ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు.