puranam : నిత్య జీవితంలో ఒకరికి నష్టం చేస్తే మనకు కూడా ఎదో ఒక సందర్భంలో నష్టం జరుగుతుందని గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. సాధ్యమైనంత మేరకు మేలు చేయకపోయినా ఫరవాలేదు. కానీ కీడు మాత్రం చేయరాదు. బ్రతికున్నంత వరకు సమయం వచ్చినప్పుడు ఏంతో కొంత సహాయం చేస్తే పుణ్యం లభిస్తుంది. కానీ ఆ ఏడు తప్పులు చేస్తే మాత్రం మీ జీవితాంతం నష్టాలు, కస్టాలు తప్పవని గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడిందని వేద పండితులు చెబుతున్నారు. చేయరాని ఆ ఏడు తప్పులు ఏమిటో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం……..
వృద్ధులను అగౌరవపరచడం వల్ల మానవతా విలువలు తక్కువగా ఉంటాయి. వృద్ధులు అనుభవజ్ఞులు, వారిని గౌరవించకుండా ప్రవర్తించడం అనేక రకాల దుష్ఫలితాలను కలిగిస్తుంది.
బ్రాహ్మణులు జ్ఞానానికి, ధర్మానికి ప్రతీకలు. వారిని హింసించడం వల్ల ఆత్మపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే బ్రాహ్మణ హత్యను అత్యంత ఘోరమైన పాపంగా భావిస్తారు.
శారీరక పరిశుభ్రత అనేది మన ఆత్మకు స్వచ్ఛతను ఇస్తుంది. పరిశుభ్రత లేకపోవడం వల్ల పాపఫలితాలు ఉంటాయని పురాణం పేర్కొంది.
గోవధను కూడా అత్యంత ప్రాణాంతకమైన పాపంగా చెప్పబడింది. ఆవును హతమార్చడం వల్ల భవిష్యత్ లో అనేక రకాల దుష్ఫలితాలు ఉంటాయి. ఇది దారుణమైన పాపం అని గ్రంథం పేర్కొంది.
తల్లిదండ్రులు దేవతలకంటే తక్కువ కాదు. వారిని అవమానించడం లేదా వారి సేవ చేయకపోవడం జీవితంలో అత్యంత పాపపు పనిగా పరిగణించబడుతుంది.
ఒకరి ఆస్తిని దుర్వినియోగం చేయడం లేదా వారి సంపదను అపహరించడం గరుడ పురాణం ప్రకారం ఆత్మకు హానికరంగా ఉంటుంది. దోపిడీ చేసేవారు భవిష్యత్ లో పాపఫలాలను అనుభవిస్తారు.
ధర్మం మార్గం నుంచి దారి తప్పడం పాపకార్యాలుగా చెప్పబడింది. మనిషి సంపదను అక్రమ మార్గాల్లో సంపాదించడం, ధర్మాన్ని విడిచిపెట్టడం వల్ల జీవితంలో శిక్షలు ఎదురవుతాయని గరుడ పురాణం చెబుతుంది.