Komuravelli : కొమురవెల్లి మల్లికార్జున స్వామి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొంగు బంగారం. మల్లికార్జున స్వామి కళ్యాణం చూడటానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కుటుంబ సభ్యులంతా రెండురోజుల పాటు అక్కడే ఉంటారు. బోనం చెల్లిస్తారు. ఎదురు పట్నం, గంగరేణు చెట్టు వద్ద పట్నం, గంగరేణు పూజలు చేసి మల్లి కార్జున స్వామికి మొక్కులు చెల్లిస్తారు.
ప్రతిఏటా మార్గశిర మాసంలో మల్లికార్జున స్వామి కళ్యాణంను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు. కళ్యాణములో ఎండోమెంట్ అధికారులు, ఆలయ కమిటీ, ఒగ్గు పూజారులు పాల్గొంటారు.
మల్లికార్జునుడు, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మల కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని కాశీలోని జంగం వాడి మఠం అధిపతి మల్లికార్జున శివాచార్య వేద పర్యవేక్షణ నిర్వహిస్తారు.
కళ్యాణం జరిగిన రోజు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణి చేస్తారు. అన్న ప్రసాదం పంపిణి చేస్తారు. దింతో కొమురవెల్లి మల్లి కార్జున స్వామి కల్యాణ ఘట్టం ముగిసిపోతుంది.