Bibipeta : కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని శివాలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శ్రీ నగరేశ్వర దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివరాత్రి సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు, మండల వాసులు ఆలయాన్ని పూలమాలలతో అలంకరించారు. మామిడి తోరణాలు కట్టి సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు.
భక్తులు ఉదయం నుంచే దర్శనం చేసుకోవడంతో ఆలయం కిటకిటలాడింది. వేద పండితులు భక్తులకు తీర్థ, ప్రసాదాలను పంపిణి చేశారు. శివ,పార్వతులను దర్శనం చేసుకొని భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం కోరిన కోరికలు తీరిన వారు తమ మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు కుటుంబ సమేతంగా ఆలయంలో జాగరణ చేసి తమ భక్తిని చాటుకున్నారు. బోనం వండి శివపార్వతులకు అర్పించారు.
శివరాత్రి పండుగ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు, మండల వాసులు, భక్తుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణంను వేద పండితులు భక్తి,,శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. భక్తి, శ్రద్దలతో నిర్వహించిన కల్యాణాన్ని చూడటానికి బీబీపేట మండలంలోని గ్రామస్తులు తండోప,తండాలుగా తరలివచ్చి తిలకించారు.