Holy : హోలీ పండుగ అంటే రంగుల పండుగ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. హిందూ కుటుంబాలు ఆనందంగా జరుపు కుంటారు. రంగులతో జరుపుకునే పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందం నింపుతుంది. కానీ హోలీ పండుగ రోజు వాళ్ళ రాశి ప్రకారం దానం చేస్తే జన్మ నక్షత్రం ప్రకారం ఆ సంవత్సరంలో కలిగినటు వంటి దోషాలు తొలగిపోతాయని వేదంలో చెప్పబడింది.
మీన రాశి ; ఈ రాశి వారు తెల్లని వస్త్రాలు, ముత్యాలు, పాలు దానం చేయాలి.
మేష రాశి : ఈ రాశి వారు హోలీ రోజున గోధుమ, రాగి వస్తువు, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయాలి.
వృషభ రాశి : ఈ రాశి వారు వెండి వస్తువు, బెల్లం, తెల్లని వస్త్రాలను దానం చేయాలి.
కుంభ రాశి : ఈ రాశి వారు రాగి వస్తువు , నీలం రంగు దుస్తులు, అన్నం దానం చేయాలి.
మకర రాశి : ఈ రాశి వారు అన్న దానం, వస్త్ర దానం చేయాలి.
మిథున రాశి : ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు వస్తువులు, పుస్తకాలు, పెన్నులను దానం చేయాలి.
ధనుస్సు రాశి : ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులు, పసుపు, ఉసిరి దానం చేయాలి.
సింహ రాశి : ఈ రాశి వారు కుంకుమ, నారింజ పండ్లను దానం చేయాలి.
వృశ్చిక రాశి : ఈ రాశి వారు రాగి, పెసలు, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయాలి.
కన్య రాశి : ఈ రాశి వారు తేనె, రాగి వస్తువు ,ఆకుపచ్చని పండ్లను దానం చేయాలి.
తుల రాశి : ఈ రాశి వారు వెండి, గులాబీ పువ్వులు, తెల్లని వస్త్రాలను దానం చేయాలి.
కర్కాటక రాశి : ఈ రాశి వారు పాలు, బియ్యం , తెల్లని పువ్వులు దానం చేయాలి.