Flowers : ప్రతిరోజూ నచ్చిన దేవుడికి పూజ చేస్తారు. పూజ సమయంలో హారతి ఇస్తారు. పూలు పెడుతారు. అగర్బత్తి వెలిగిస్తారు. మరుసటి రోజు యధావిధిగా పూజ చేస్తారు. కానీ కొందరు ముందు రోజు పెట్టిన పూలు తీసివేసి తాజా పూలు పెడుతారు. కొందరు వాడిన పూలు తీసివేయరు. వాడిన పూలు దేవుడి వద్ద నుంచి తీసివేయకుండానే పూజ చేస్తే ఏమవుతుందో చాలా మందికి తెలియదు. కానీ వాడిన పూలు ఏ రోజుకు ఆరోజు తీసివేయాలని వేద పండితులు చెబుతున్నారు.
వాడిన పూలు వదిలేస్తే ఇంట్లో అశాంతి నెలకొటుంది. దేవుడి గది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. దాంతో శుభాలు కలుగుతాయి. అదే విదంగా ఇంటిలో కలహాలు మొదలవుతాయి. కుటుంబ సభ్యుల్లో మానసిక ప్రశాంతత ఉండదు. ప్రతి రోజూ పువ్వులు దేవుళ్లకు సమర్పించకపోయినా పర్వాలేదు. కానీ దేవుడి ఫోటోల వద్ద ఎండిపోయిన పువ్వులను ఉంచరాదని వేదంలో చెప్పబడింది.
వాడిన పువ్వులను దేవుడి ఫోటోల వద్ద ఉంచడం వలన ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ తయారవుతుంది. వాడిన పూలను దేవుళ్ళ వద్ద ఉంచి పూజలు చేసిన తగిన ప్రతిఫలం ఉండదని వేదంలో చెప్పబడింది. పూజ సమయంలో పూలు లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వాడిపోయిన పూలతో ఎన్ని గంటలు పూజ చేసినా ప్రతిఫలం ఉండదని వేదపండితులు చెబుతున్నారు.