Poor CM : దేశంలోని ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, పోలీస్ కేసులకు సంబంధించిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఏడీఆర్ వెల్లడించిన నివేదికల ప్రకారం అత్యంత సంపద ఉన్న ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని అతి తక్కువ సంపద ఉన్న ముఖ్యమంత్రి వివరాలను కూడా బయటపెట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో అతి తక్కువ సంపద ఉన్న ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆమె సంపద కేవలం రూ : 15 లక్షల విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నవి. అదే విదంగా అత్యంత సంపద ఉన్న ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈయన ఆస్తుల విలువ రూ. 931 కోట్లు. అత్యంత సంపదతో దేశంలోనే నెంబర్ వన్ సీఎం గా గుర్తింపు పొందారు.
దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులల్లో 13 మంది పై క్రిమనల్ కేసులున్నట్టుగా ఏడీఆర్ ప్రకటించింది. దేశంలో ఇద్దరు మహిళలు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు. ఒకరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, మరొకరు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి. 38 ఏళ్ల అతిషి దేశంలోనే అత్యంత పిన్న చిన్న వయస్సురాలు కావడం విశేషం.