Railway Job : ITI పాసై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి కోసం రైల్వే డిపార్ట్మెంట్ శుభవార్త తెలిపింది. ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో 2,424 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. ఆగష్టు 15 తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైతే సరిపోతుంది. అదేవిదంగా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కూడా పాస్ తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 2024 జులై 15 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉంటె సరిపోతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నియామకం చేసుకుంటోంది రైల్వే డిపార్ట్మెంట్. ఇంటర్వ్యూ కూడా అవసరం లేదు. కేవలం పదోతరగతి తో పాటు, ఐటిఐ పాస్ అయితే సరిపోతుంది.
ట్రేడ్స్ : ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మెకానిక్, పెయింటర్, మెషినిస్ట్, షీట్ మెటల్ వర్కర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామ్ అసిస్టెంట్ ట్రేడ్ లల్లో ఖాళీలు ఉన్నవి. ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
పదో తరగతి, ఐటీఐ లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. వీటితో పాటు రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను అప్రెంటీస్ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.