Home » EX CM KCR : తెలంగాణ ఉత్సవాలకు కేసీఆర్ వెళ్లేనా ???

EX CM KCR : తెలంగాణ ఉత్సవాలకు కేసీఆర్ వెళ్లేనా ???

EX CM KCR : తెలంగాణ సాధన కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు. జైలు కు వెళ్లారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారు. సింగరేణి కార్మికులు సైతం సమ్మె బాట పట్టారు. అందరి పోరాటం ఫలించి ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రము ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జూన్ రెండున ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైనది.

హైదరాబాద్ పరేడ్ మైదానంలో ఉత్సవాలను పదివేల మందితో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఆవిర్భావం రోజున తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వం అధికారికంగా గీతాన్ని ప్రజల సమక్షంలో విడుదల చేయనుంది. ” జయ జయ జయహే తెలంగాణ ” అనే గీతాన్ని ప్రముఖ కవి, గేయ రచయిత అందే శ్రీ రచించింనది విదితమే. ఆ గీతాన్నిరాష్ట్ర గీతం గా రాష్ట్ర మంత్రి వర్గం అధికారికంగా ఆమోదించింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించారు. ఆ వేడుకలో రైతు రుణమాఫీ పథకాన్ని సోనియా చేతుల మీదుగా ఆవిస్కరించనున్నారు. తెలంగాణ ఆవిర్భావం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల మీదుగా జరిగింది. కాబట్టి ఈ వేడుకల్లో సోనియాను తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా ఘనంగా సన్మానించనున్నారు. అందుకు ఆమెకు ప్రత్యేక ఆహ్వానం పంపారు.

ఆవిర్భావ వేడుకలకు రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వాన పత్రికలను పంపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపుతున్నారు. ఆ వేడుకల్లో కేసీఆర్ ను ఘనంగా సన్మానించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సన్మానం విషయం పక్కకు పెడితే ఇంతకు కేసీఆర్ ఆహ్వానం మేరకు వేడుకలకు వెళుతారా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు రాని కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి అంటే గిట్టని నాయకుడు. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటున్న నేపథ్యంలో కేసీఆర్ వేడుకకు వెళ్ళేది అనుమానమేననే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *