పదోన్నతి పొందిన కాసిపేట-1 గని మేనేజర్ భూ శంకరయ్య
కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
Singarni : సింగరేణి సంస్థ కార్మికుల సహకారంతోనే బొగ్గు ఉత్పత్తి సాధిస్తోందని కాసిపేట – 1 గని మేనేజర్ భూ శంకరయ్య అన్నారు. కాసిపేట -1 గని మేనేజర్ గా విదులు నిర్వహిస్తోన్న ఆయన రక్షణ అధికారిగా పదోన్నతి పొందారు. మందమర్రి ఏరియాకు పదోన్నతి పై బదిలీ అయిన సందర్బంగా ఆయనను గని కార్మికులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన గని అధికారులను, సూపర్ వైజర్లను, నాయకులను, కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికుల ఆదరాభిమానాలు పొందడం అంతగా సులభం కాదన్నారు. వారిలో ఒకరై అధికారులు పనిచేసినప్పుడే కార్మికుల అభిమానం పొందుతారన్నారు.
ఈ కార్యక్రమంలోమేనేజర్ సతీష్, రక్షణ అధికారి నిఖిల్,డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ నాయకులు చిప్ప నర్సయ్య, బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్, మీనుగు లక్ష్మినారాయణ, పిట్, సేఫ్టీ కమిటీ సభ్యులు, INTUC యూనియన్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మణ్ దాస్, ఫిట్ కార్యదర్శి రవీందర్, TBGKS నుండి బైరి శంకర్,చోల్లంగి శ్రీనివాస్,CITU నాయకులు తిరుపతి,శ్రీధర్,SC/ST అసోషియేషన్ నాయకులు కనుకుల తిరుపతి, సుదర్శన్ పాల్గొని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారి మీర్జా గౌస్,అండర్ మేనేజర్లు మూర్తి,సుమన్ రెడ్డి,హిమాలయ్, సర్వేయర్ ప్రభాకర్,ఖాన్,ఇంజనీర్ రామకృష్ణ,నాయకులు రాజేందర్,సురేష్,రవి,శ్రీహరి,ఈదునూరి బాపు,కన్నయ్య,అబ్దుల్, రమేష్,POA,ఆపీస్ సిబ్బంది,తదితరులు పాల్గొని సన్మానించారు.