BMS : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఎంఎస్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. భారతీయ మజ్దూర్ సంఘ జిల్లా అధ్యక్షులు పతాకావిష్కరణ చేశారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి అసంఘటిత కార్మికులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ అనంతరం తెలంగాణ కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘం అనుబంధంగా జిల్లా పెయింటర్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కమలాకర్ అధ్యక్షతన, బిఎంఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కంది శ్రీనివాస్ ప్రకటించారు.
మంచిర్యాల జిల్లా పెయింటర్స్ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగ ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మద్దూరి రాజు యాదవ్, సలహాదారులుగా మామిడి గోపాల్, అధ్యక్షులుగా పాలమర్ల సందీప్, ఉపాధ్యక్షులుగా సంగెం లక్ష్మీనారాయణ, మల్లెపల్లి రవీందర్, పూరెల్ల లక్ష్మణ్, కార్యదర్శిగా ఏల్పుల స్వామి, సహ కార్యదర్శులుగా రేగుంట సంపత్ కుమార్, వేమురల మల్లేష్, మెరుగు కుమార్, సంఘటన కార్యదర్శి గా జంగేపల్లి భూమయ్య, కార్యాలయ కార్యదర్శిగా మహానంద్ రత్నాకర్, కోశాధికారి గా గగ్గూరి విశాల్, కార్యవర్గ సభ్యులుగా గాదం ఏమంత్ కుమార్, ఇరికిల రాజేష్, చొప్పదండి రమేష్, చిన్న తిరుపతి, బత్తుల కుమార్, ములకల సతీష్ కుమార్, కాటం నితిన్ సామి, వేల్పుల తిరుపతి, బన్సోద్ సుధాకర్, సంకెళ్ల రవికుమార్, గడిపెల్లి క్రాంతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘ్ ప్రబారి శంకర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్, ఎన్ టి పి సి Bms ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సాగర్ రావు పాల్గొన్నారు