Home » భద్రాద్రి రామయ్య పెళ్ళికి అనుమతి లేదంటున్న ఎన్నికల కమిషన్

భద్రాద్రి రామయ్య పెళ్ళికి అనుమతి లేదంటున్న ఎన్నికల కమిషన్

xr:d:DAGBRDuLR64:126,j:5431766097674953391,t:24041512

కోల్ బెల్ట్ ప్రతినిధి:
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.కొందరు భక్తులు స్వామి సన్నిధిలోనే తలంబ్రాల దృశ్యాన్ని కనులార తిలకించడానికి బయలుదేరారు.ఈనెల 17న కళ్యాణ్ మహోత్సవాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం,ఆలయ కమిటీ,దేవాదాయశాఖ ఉన్నతాధికారులు,అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.భక్తులకు సౌకర్యాలను ఏర్పాటుచేశారు.లోకసభ ఎన్నికల నేపథ్యంలో కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయరాదని ఇటీవల ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది.ఈ నేపథ్యంలో
గత నలబై ఏళ్లుగా కళ్యాణమహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ప్రభుత్వ పరంగా చేస్తున్నామని, ఇందుకు అనుమతి ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఈవో వికాస్ రాజ్ కు లేఖ రాసారు. తెలుగు ప్రజల మనోభావాలకు సంబందించిన అంశం కాబట్టి ప్రత్యక్ష ప్రసారం కు అనుమతి ఇవ్వాలని కోరారు. అదేవిదంగా భక్తులు కూడ ప్రత్యక్షంగా చూడటానికి దేవాలయంకు రాలేరు. ఎన్నికలకు, కళ్యాణంకు రాజకీయంగా ముడిపెట్టడం సరికాదని,భక్తులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కోరారు.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *