INDRAKARAN REDDY :తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధానమైన నాయకులు కండువాలు మారుస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు సమాచారం ఉండటంలేదు. ఎన్నికల వేల ఈ జంప్ జిలానీల వ్యవహారం తగలనోప్పిగా మారింది. ముక్యంగా గులాబీ నేతల పయనం అధినేత కేసీఆర్ కు కొంతమేరకు ఇబ్బందిని తెచ్చిపెడుతోంది. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాకలు తీరిన యోధుడు, కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరుపొందిన మాజీ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి బుధవారం కారు దిగి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బాట పట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఇంచార్జి డిపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ కండువా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కప్పుకోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గులాబీ శ్రేణులు ఖంగుతిన్నారు. ఎన్నికల వేల బిఆర్ఎస్ కు ఇది పెద్ద బిగ్ షాక్.
–—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-