Farmer : కేంద్ర ప్రభుత్వం రైతులను అభివృద్ధి పథంలో నడిపించడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. రైతులకు సబ్సిడీ కింద ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, పరిశ్రమల స్థాపనకు అవకాశాలు కల్పిస్తోంది. అదే విదంగా సోల పవర్ ప్లాంట్ ల నిర్మాణంకు కూడా సబ్సిడీ అందిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో మరో శుభవార్త ప్రకటించింది.
ప్రస్తుతం రైతులకు కిషన్ క్రెడిట్ కార్డు రుణపరిమితి రూ : 3 లక్షలు ఉంది. ఈ పరిమితిని తాజా బడ్జెట్ లో పెంచుతున్నట్టుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ప్రకటించారు. దింతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ : 3 లక్షల రుణపరిమితిని రూ : 5 లక్షల వరకు సవరిస్తున్నట్టుగా ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి.
అదే విదంగా పాల ఉత్పత్తి దారులకు, మత్స్యకారులు, రైతులకు స్వల్పకాలిక రుణాలు ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు మంత్రి. కేంద్ర మంత్రి ప్రకటించిన బడ్జెట్ రైతాంగానికి మేలు చేసే విదంగా ఉందనే అభిప్రాయాలు సైతం రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.