Home » Good Coffee : ప్రతిరోజూ తాగండి… ఆయుష్షు పెరుగుతుంది

Good Coffee : ప్రతిరోజూ తాగండి… ఆయుష్షు పెరుగుతుంది

Good Coffee : ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కొందరు కాఫీ తాగుతారు. మరికొందరు చాయ్ తాగుతారు. ఇవేవి కాకుండా పాలు తాగేవారు కూడా ఉన్నారు. ఇంకా కొందరు ఈ మధ్యన గ్రీన్ టీ తాగుతున్నారు. అదేవిదంగా ఇవి కాకుండా నిమ్మరసం, తేనె తాగుతున్నారు. మరికొందరు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతున్నారు.వీటిని తాగడం వలన మన శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి.

ఆరోగ్యముగా కూడా ఉంటున్నాం. అదే విదంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో నిర్విరామంగా పనిచేస్తుంటారు. కదలకుండా పని చేస్తుంటారు. కాబట్టి కొద్ది సేపు సేదతీరడానికి టీ, కాఫీ, గ్రీన్ టీ తాగుతుంటారు. అటువంటి వారికీ వీటిలో ఏది తాగితే వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటది. అంతే కాదు వాళ్ళ ఆయుష్షు పెరుగుతుందా, తగ్గుతుందా అనే విషయాన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

సైన్స్ అలెర్ట్ లో ఒక ప్రత్యేక కథనం ప్రచురితమైనది. కాఫీ తాగే వారి ఆయుష్షు పెరుగుతుందని అందులో చెప్పబడింది. కాఫీ తాగే వారితో పాటు, కాఫీ తాగని వారి పై ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, కాఫీ తాగే వారి ఆయుష్షు ఎక్కువగా ఉంటుందని తేలింది. కాఫీ తాగే వారి మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉంటుందని తేలింది.

యూఎస్ లో జరిగిన ఈ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనది. ఎక్కువసేపు కూర్చోవడం, గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం వారి ఆయుష్షు తక్కువగా ఉంటుందని తేలింది. అలంటి వారు కాఫీ తాగడం వలన వాళ్ళ ఆయుష్షు పెరుగుతున్నదని యూఎస్ లో జరిపిం పరిశోధనల్లో తేలింది. ఈ పరిశోధన విషయాలు తెలియడంతో ఇప్పుడు దీర్ఘంగా పనిచేస్తున్న వారు కాఫీ తాగడానికి ముందుకు వస్తున్నారని సమాచారం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *