juice : కొత్తిమీర ను కూరల్లో వాడుతారు. కేవలం కూరలు రుచిగా ఉండేందుకు, సువాసన రావడానికి మాత్రమే వాడుతారు. ఇంతవరకే కొందరికి కొత్తిమీర గురించి తెలుసు. కొందరికి మాత్రం కొత్తిమీర జ్యుస్ తాగితే శరీరానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొత్తిమీర ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మూత్రపిండాల సమస్యలతో ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొత్తిమీరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. గ్యాస్, గుండెల్లో మంట, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొత్తిమీర జ్యూస్‌తో కనీసం 30 నుంచి 40 రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.