Seed Benefits : దంతాలు బలంగా ఉండాలన్నా, ఎముకలు గట్టిగా ఉండడానికి అనేక ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిదంగా కీళ్ల నొప్పులు, శరీర భాగాలూ వాపు రాకుండా ఉండటానికి కూడా మనకు కొన్ని పదార్థాలు ఉపయోగపడుతాయి. రక్తహీనత కు కూడా కొన్ని ఫలములను వాడుతాం. గుండెలో రక్తనాళాలను ఆరోగ్యాంగా ఉంచడానికి కూడా కొన్ని పదార్థాలు దోహదపడుతాయి.
చాలా మందికి పూల్ మఖానా గురించి తెలియదు. పూల్ మఖానా కు మరొక పేరు కూడా ఉంది. లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. చెరువుల్లో ఎక్కువగా పెరుగుతాయి. వాటిలో తయారయ్యే గింజలనే పూల్ మఖానా అని అంటారు. వీటిని నెయ్యిలో వేంపుకొని కూడా తింటారు. వీటిని తినడం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అనేక వ్యాధులకు ఈ గింజలు ఎంతో ఉపయోగపడుతాయి.
వీటిని తినడం వలన పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచుతాయి. లోటస్ గింజల్లో కొలెస్ట్రాల్, సోడియం తక్కువ మోతాదులో ఉంటాయి. మూత్రపిండాల సమస్యలతో పాటు, విరేచనాలు, వివిధ వ్యాధుల చికిత్సకు ఇది చాలా ఏళ్ల నుంచి ఉపయోగించబడుతోంది. పూల్ మఖానాలో ప్రోటీన్, ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. కోరికలను తగ్గిస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా గుండె జబ్బులను నివారిస్తుంది.వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. క్యాన్సర్ వ్యాధి రాకుండ ఉపయోగపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది. కాల్షియం పుష్కలంగా ఉంటుంది. జుట్టు రాలకుండా కాపాడుతుంది. చర్మం ముడతలు రాకుండా నిరోధిస్తుంది.