Rajamouli : తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొత్త సినిమా ఏ హీరోతో తీస్తున్నాడో అని అభిమానులు ఇన్ని రోజులు ఎదురు చూశారు. ఎట్టకేలకు మహేష్ బాబుతో తీస్తున్నట్టుగా తెలిసిపోయింది. కానీ ఆ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవాన్ని మాత్రం రాజమౌళి చాలా సాదా, సీదాగా చేపట్టారు. కొద్ది మందితోనే చిత్రం షూటింగ్ ప్రారంభించారు. ఎలాంటి ఆర్భాటాలకు అవకాశం ఇవ్వలేదు.
సినిమా షూటింగ్ కోసం ఎలాంటి అప్ డేట్ కూడా ఇవ్వడం లేదు. పెద్ద ప్రచారానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు రాజమౌళి. సినిమా షూటింగ్ ప్రారంభమైన నాటి నుంచి మాత్రం ఎడిటింగ్ విషయంలో మాత్రం చాలా వేగంగా పనులు చేయిస్తున్నాడు రాజమౌళి. వీలయినంత తొందరగా సినిమా పూర్తి చేసి, గ్రాఫిక్ పై దృష్టి పెట్టాలనే ఆలోచన ఉన్నట్టు చిత్రబృందం సమాచారం.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ డ్రామాగా మహేష్ బాబుతో ఈ సినిమా ను నిర్మిస్తున్నారు రాజమౌళి. రాజమౌళి సినిమా అంటేనే భారీ ఖర్చుతో కూడుకొని ఉంటుంది. పెట్టుబడి దారులు కూడా ఆయన తో సినిమా తీయడానికి పెట్టె ఖర్చులో వెనుకాడరు. మహేష్ బాబుతో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ డ్రామాగా నిర్మిస్తున్న సినిమా ఖర్చు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు అవుతోందని తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ అయ్యింది.