Alluri Sitaramaraju Hit Picture in sini industry :
ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. చూసిన కొద్దీ మరోసారి చూడాలనిపిస్తుంది. చూసిన కొన్ని గంటలకే ఇంకోసారి చూడాలని కోరిక పుడుతుంది. అంతేకాని ఆ సినిమా మాత్రం నాకు బోర్ కొట్టదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు ప్రముఖ తెలుగు సినీ పరిశ్రమ నటుడు మహేష్ బాబు.ఇటీవల ఆయన తన అభిమానులతో కాశీలి సరదాగా ముచ్చటించారు. ఆ సమయంలో మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సొంతంగా నిర్మించి, నటించిన చిత్రం అల్లూరి సీతారామరాజు చిత్రం గురించి ముచ్చటించారు. ఆరోజుల్లో ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. కృష్ణ నటించిన విదంగా నేను నటించలేనని, ఆ విదంగా తీయలేనని కూడా నటుడు,మాజీ ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు ఒక సందర్భంలో సినీ ప్రముఖుల వద్ద స్పష్టం చేశారు. అటువంటి గొప్ప చిత్రాన్ని మరోసారి మీరు తయాల్సిందిగా నటుడు మహేష్ బాబును ఆయన అభిమానులు కోరారు.
అభిమానుల కోరిక కాదనలేక మహేష్ బాబు సున్నితంగా ఆ విషయాన్ని తిరస్కరించారు. మా నాన్న నటించిన సినిమాపై నేను ప్రయోగాలు చేయలేను. అంత సాహసం నాలో లేదు కూడా. అల్లూరి సీతారామరాజు సినిమా నాకు ఎల్లవేళలా ఇస్టమైన సినిమా. నాన్న సొంతంగా కష్టపడి ఏంతో ఇష్టంగా నిర్మించారు. ఆ రోజుల్లో 70 ఎంఎం స్కోప్ లో ఈస్టమన్ కలర్ లో చాల ఖర్చు పెట్టి అద్భుతంగా నిర్మించారు. కాబట్టి అల్లూరి సీతారామరాజు సినిమాను ఎన్నిసార్లు చూసినా, ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది మీరు కూడా అల్లూరి సీతారామరాజు సినిమా తీయవచ్చు కదా, అదే పాత్రను చేయగలరు అని అడిగారు. ఇప్పటికి కూడా అడుగుతున్నారు.
అల్లూరి సీతారామరాజు పాత్రకు న్యాయం చేయడం నాతో కాదు. అంత సాహసం కూడా చేయలేను. చేయడానికి నాకు ఇష్టం లేదు. నాన్న మాదిరిగా నటించడం నాతో సాధ్యం కాదు. అభిమానులను మెప్పించిన ఆ పాత్రలో నటించి అనవసరంగా అన్యాయం చేసిన నటుడిగా మిగిలిపోతాను సినీ చరిత్రలో. అందుకనే నాకు సమయం దొరికినప్పుడల్లా అల్లూరి సీతారామరాజు సినిమా చూసి ఆనందిస్తూ సంతోషంగా ఆరోజు గడపటం నాకు ఇష్టం. నాన్న నటించిన సినిమా చూస్తో ఆనందంగా గడపటం కంటె ఇంకా ఒక నటుడికి ఏమి కావాలి అంటూ అభిమానులకు సెలవిచ్చారు.
————————–
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
————————–