Home » దిల్ రాజు కాళ్ళు పట్టుకున్న డైరెక్టర్ ….

దిల్ రాజు కాళ్ళు పట్టుకున్న డైరెక్టర్ ….

Dill raju : 2004 లో ఆర్య సినిమా ప్రేక్షకులను మెప్పించింది. బన్నీ అభిమానులను ఆనందాల్లో ముంచెత్తింది. నిర్మాతగా పెట్టుబడి పెట్టిన దిల్ రాజుకు లాభాలు తెచ్చి పెట్టింది. అంతేకాదు డైరెక్టర్ సుకుమార్ ను తిరుగులేని దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో నిలబెట్టింది. ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఆర్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 20 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్బంగ హైదరాబాద్ లో సినిమా యూనిట్ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఆర్య సినిమా నటీ నటులు, దర్శక,నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్, సాంకేతిక వర్గం అందరు 20 సంవత్సరాల వేడుకలో పాల్గొన్నారు. వేడుక సందర్బంగా ఒకరి తరువాత ఒకరు మాట్లాడుతున్నారు. అందరూ సరదాగా మాట్లాడుతూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

అందరితో పాటు దర్శకుడు సుకుమార్ వంతు కూడా ఆర్య సినిమా అనుభవాలను పంచుకునే అవకాశం వచ్చింది. ఈ సందర్బంగ సుకుమార్ మాట్లాడుతూ కొత్తగా సినీ పరిశ్రమలోకి వచ్చిన దర్శకులతో నిర్మాతలు సినిమా చేయడానికి సాహసం చేయరు. కొత్త దర్శకులు కూడా నిర్మాతల ఇంటి చుట్టూ తమ ప్రతిభను చాటుకోడానికి తిరుగుతారు. ఎవరైనా కనికరిస్తే ఆ దర్శకుడి జీవితం బాగుపడుతుంది. లేదంటే అతను ఇంటికి వెళ్లాల్సిందే. కానీ నన్ను నమ్మి, నా ప్రతిభను చూడకుండానే దిల్ రాజు నాతో సినిమా తీయడానికి అంగీకరించారు. అందుకు దిల్ రాజుకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని దర్శకుడు సుకుమార్ తన మొదటి సినిమా దర్శకత్వానికి సంబందించిన విషయాలను వెల్లడించారు.

చివరగా మాట్లాడుతూ దిల్ రాజు నేను కలిసి ఆర్య షూటింగ్ సమయంలో ఒక సీన్ గురించి చర్చించు కుంటున్నాము. ఆ సినిమాలో ఆ సీన్ కు ప్రత్యేక స్థానం ఉంటుందని, చాలా ముఖ్యమైన సన్నివేశమని వివరించాను. సీన్ గురించి విన్నాక దిల్ రాజు ఆ సీన్ తీయడం వలన చాల ఖర్చు అవుతుందని అంగీకరించలేదు. ఎంత నచ్చచెప్పినా ఒప్పుకోలేదు. ఇద్దరిమధ్య మాట, మాట పెరిగిపోయింది. అప్పటిదాక గౌరవంగా మాట్లాడుకున్న వాళ్ళం కాస్త అమర్యాద వరకు మాటలు వెళుతున్నాయి. ఇద్దరి మధ్య గొడవ క్షణం, క్షణం పెరిగిపోతోంది. షూటింగ్ సమయం కాబట్టి అందరూ మావైపే చూస్తున్నారు. అందరి ముందు ఇద్దరం అమర్యాదగా మాట్లాడుకోవడం నాకు నచ్చలేదు.

నేనేమో ఇండస్ట్రీ కి కొత్తగా వచ్చినవాన్ని. దిల్ రాజు ఎంతయినా సీనియర్. అప్పటికే దిల్ రాజు అంటే సినీ ఇండస్ట్రీలో పేరు మారుమోగుతోంది. అంత పెద్ద నిర్మాతను నేను ఎలా తట్టుకోగలను. ఏమి చేయాలో అంతుపట్టలేదు. ఏది అయితే అదే అవుతుంది. ఒక నిర్ణయానికి వచ్చాను. అందరూ చూస్తుండగానే దిల్ రాజు రెండు కాళ్ళు వదల కుండా పట్టుకున్నాను. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఏమిజరుగుతుందో ఎవరికీ కూడా అర్థం కాలేదు. ఆ సీన్ చేయడానికి ఒప్పుకోవాల్సిందేనని బతిమిలాడాను. ఇక దిల్ రాజు ఒప్పుకోక తప్పలేదు అంటూ నవ్వుతూ సుకుమార్ చెప్పాడు. అప్పటివరకు సుకుమార్ అనుభవాన్ని చెబుతుంటే వింటున్న వారంతా కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. దిల్ రాజు తోపాటు , హీరో అల్లు అర్జున్, ఇతర సాంకేతిక నిపుణులు కూడా నవ్వు ఆపుకోలేక పోవడం విశేషం.
———————-
Editor : P .R . Yadav
9603505050
———————–

 

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *