Actor : చిత్ర పరిశ్రమలో విజయం, పరాజయం మామూలే. ఎదిగినట్టే ఎదుగుతారు. తిరిగి అదే ఎత్తు నుంచి పడిపోతారు. ఇదంతా కూడా నటీనటులకు మామూలే. అయితే ఒక హీరోయిన్ తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో నటించింది. ఒక్క తెలుగులో మాత్రం నిలదొక్కుకోలేక పోయింది. అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ, హిట్లు మాత్రం ఆ నటి ఆశించినంత రాలేదు.
తెలుగులో 16 సినిమాల్లో నటించింది. అందులో ఏడు సినిమాల్లో మాత్రమే ప్రేక్షకుల ఆదరణ పొంది, విజయాన్ని అందుకున్నాయి. కానీ మిగతా తొమ్మిది సినిమాలు ఆ నటి ఆశించినంత మేరకు ప్రేక్షకుల అభిమానాన్ని అందుకోలేక పోయినవి. ఇంతకూ ఆ ముద్దు గుమ్మ ఎవరను కుంటున్నారు…… నిత్యామీనన్.
పవన్ కళ్యాణ్ తో “భీమ్లా నాయక్ ” సినిమాలో నటించింది. ఈ సినిమా ఆమెకు చివరి సినిమా కావడం విశేషం. ఆ సినిమా తరువాత బుల్లి తెరపై కూడా నటించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మెరిసిపోతోంది. అభిమానులకు అందుబాటులో ఉంటూ చాటింగ్ కూడా చేస్తోంది.