3 years suting : దర్శక, నిర్మాతలు ఒక సినిమా తీయడానికి కనీసం ఏడాది కాలం పడుతుంది. చిన్న సినిమా అయితే రెండు నుంచి మూడు నెలలు పడుతుంది. భారీ బడ్జెట్ సినిమా అయితే కూడా ఏడాది నుంచి ఏడాదిన్నర లోపు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తారు. కానీ సినిమా షూటింగ్ మొత్తంకు పట్టే సమయానికంటే ఒకే ఒక్క సీన్ కోసమే మూడేళ్లు పట్టింది. ఆ సీన్ తీసిన విధానం ఆ సినిమా దర్శకుడికి నచ్చకపోవడమే ప్రధాన కారణమని సినీ పరిశ్రమలో ఆ రోజుల్లో పెద్ద టాక్. ఇంతకు ఆ సినిమా పేరు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర హీరోలు. అంజద్ ఖాన్ విలన్ పాత్రలతో నిర్మిస్తున్న సినిమా ” షోలే “. ఆ సినిమాలో జయాబచ్చన్ దీపం వెలిగించే సీన్. ఆ ఒక్క సీన్ ను షూటింగ్ చేయడానికి దర్శక, నిర్మాతలకు మూడేళ్ళ సమయం పట్టిందని అమితాబ్ బచ్చన్ ఇటీవల మాట్లాడుతూ వెల్లడించాడు. సూర్యాస్తమయంలో తీయాలనుకున్న సీన్ కోసం మూడేళ్లు పట్టింది.
ఆ సీన్ కోసం షూటింగ్ చేసిన ప్రతిసారి డైరెక్టర్ కు నచ్చకపోవడంతో మరోసారి తీయాల్సిందే అంటూ డైరెక్టర్ పట్టుపట్టడం జరిగింది. ఎట్టకేలకు మూడేళ్ళ తరువాత సూర్యాస్తమయంలో తీసిన షాట్ ను డైరెక్టర్ ఒకే చెప్పేశాడు. ఆ షూటింగ్ పూర్తి కావడంతో సినిమా విడుదల చేయడం జరిగిందని అమితాబ్ బచ్చన్ చెప్పారు.
” షోలే ” సినిమాలోని ” ఏ దోస్త్ కీ ” పాట ఐదు నిముషాలు ఉంటది. ఆ ఒక్క పాటను 21 రోజులు షూటింగ్ చేశారు. విలన్ పాత్ర చేసిన గబ్బర్ సింగ్ ఒకరిని హత్య చేయాలి. ఆ హత్యకు సంబంధించిన సీన్ తీయడానికి 19 రోజులు పట్టిందని అమితాబ్ బచ్చన్ చెప్పడం జరిగింది. రైల్ లో దొంగతనం కు సంబందించిన సీన్ తీయడానికి యాబై రోజులు పెట్టిందనే విషయాన్నీ కూడా అమితాబ్ బచ్చన్ వివరించారు.
మూడేళ్లకు పైగా షూటింగ్ చేసిన ” షోలే ” ఆగస్టు, 15,1975లో విడుదల అయ్యింది. మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ సినిమా నిర్మించడం విశేషం.