కోల్ బెల్ట్ న్యూస్ :మందమర్రి
కాంగ్రెస్ పార్టీ సింగరేణి అనుబంధ కార్మిక సంఘం INTUC క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాంపెల్లి సమ్మయ్య కు “కార్మిక శక్తి” అవార్డును ప్రధానం చేసి క్రేజీ డాన్స్ అకాడమీ వారు ఘనంగా సన్మానించారు.క్రోది నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని మందమర్రిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో క్రేజీ డాన్స్ అకాడమీ వారు సేవారంగం,కళలు,విద్య,ఉద్యోగ,కార్మిక తదితర రంగాల్లో సేవచేసిన వారిని ఎంపిక చేసి అవార్డులను ప్రధానం చేశారు.ఎంపికయిన కాంపెల్లి సమ్మయ్య ఈ సందర్బంగా మాట్లాడుతా మందమర్రి ప్రాంతం కేవలం బొగ్గుగనులకు పుట్టినిల్లు కాదని,కవులకు,కళాకారులకు,విద్యావంతులకు,మేధావులకు కూడా పుట్టినిల్లేనని అన్నారు.40 ఏళ్ల కిందట వరంగల్ నుంచి వచ్చి కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందన్నారు.వారికి దీటుగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులకు ఇప్పుడు మందమర్రి వేదిక అయ్యిందన్నారు.సింగరేణి కార్మిక వర్గంలో కూడా మందమర్రి ఏరియా కార్మికులు కూడా కోల్ ఇండియా స్థాయి పోటీలో పాల్గొని సింగరేణికి పేరుతెచ్చిన కార్మిక కళాకారులు ఇక్కడే ఉండటం అభినందనీయమన్నారు. అనంతరం దసరా సినిమా దర్శకుడు సురేష్ మాట్లాడుతూ విద్యార్ధి దశ నుంచే కాంపెల్లి సమ్మయ్య సమాజ సేవలో ఉన్న విషయం తెలుసన్నారు. కార్మికుడిగా సింగరేణిలో చేరి కార్మిక రంగంలో కూడా 30 ఏళ్లుగా సేవచేయడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర జానపద కలకారుడు అంతడుపుల నాగరాజు, ఉప్పులేటి నరేష్, INTUC సెక్రటరీ పాణగంటి వెంకటస్వామి, నాయకులు D.శంకర్ రావు మరియు కవులు,కలకారులు,నృత్య కళాకారులు తదితరులు పాలుగొన్నారు.