కోల్ బెల్ట్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడిక్కింది. పోటాపోటీగా ప్రచారం కొనసాగుతోంది.ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.ఓటర్లను ఆకట్టుకోడానికి హామీలను గుప్పిస్తున్నారు.అధికారం కోసం ఒక పార్టీకి మించి మరొక పార్టీ మేనిఫెస్టో తయారు చేస్తోంది.మరోసారి వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టకుండా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబునాయుడు బీజేపీ,జనసేన పార్టీలతో జతకట్టారు.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఒంటరిగానే పోటీ చేస్తున్నారు.షర్మిల కూడా జగన్ ను ఓడించడానికే తన అన్నతో యుద్ధం చేస్తున్నానని ప్రచారంలో చెబుతోంది. కానీ జగన్ మాత్రం ఒంటరిగానే కూటమితోపాటు తన చెల్లెలును ఎదుర్కొంటున్నారు.రెండోసారి కూడా అధికారం తనదేననే ధీమాలో ఉన్నారు.
కూటమి ప్రచారం….
తెలుగుదేశం,జనసేన,భారతీయ జనతా పార్టీ కోటమిగ ఏర్పడ్డాయి.కేవలం జగన్ ను గద్దె దించడానికి ఒక్కటయ్యాయి.బహిరంగ సభల్లో మోడీతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు.ముగ్గురు కలిసి కేవలం జగన్ ను లక్ష్యముగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి సభల్లో పాల్గొంటున్నారు. అదేవిదంగా పవన్ కళ్యాణ్ తో కలిసి కూడా ప్రచారం చేస్తున్నారు.ఒంటరిగా చంద్రబాబు ఒక్కడే సభల్లో పాల్గొని ప్రచారం చేస్తున్నారు.మంగళగిరి నుంచి టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేశ్,కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పోటీచేస్తున్నారు.
పసుపుతోట …..
ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో సభలు,సమావేశాలు పెట్టినా జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు.కార్యకర్తలు పసుపు రంగు చొక్కాలు ధరించి వస్తున్నారు.చంద్రబాబు దృష్టి పడేవిదంగా కార్యకర్తలు పార్టీ జెండాలు ఊపుతూ నినాదాలు చేయడంతో చంద్రబాబు మురిసిపోతున్నాడు.మహిళలు కూడా పసుపు రంగు చీరలు కట్టుకొని వస్తున్నారు.బాబుకు తిలకం దిద్ది, హారతి ఇస్తూ పసుపు చీరలతో ఆకర్షణగా నిలుస్తున్నారు.సభ ప్రాంగణం అంత కూడా పసుపురంగుతో ఉన్న వస్తువులనే వాడుతూ అలంకరణ చేస్తున్నారు.పార్ట్ శ్రేణులు తమ వాహనాలను పసుపు రంగుతో ప్రత్యేకంగా తాయారు చేసుకొని చంద్రబాబు సభలకు వస్తున్నారు.చంద్రబాబు,పవన్ కళ్యాణ్ నిర్వహించే సభలు,కార్యక్రమాలన్నీ కూడా పసుపు రంగుతో కూడిన బ్యానర్లు,జెండాలతో ఉండేసరికి ఆ ప్రాంతమంతా కూడా పసుపుతోటను మరిపిస్తోంది.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-