Home » Singareni : జివిఆర్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Singareni : జివిఆర్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Singareni : మంచిర్యాల జిల్లా శ్రీరామ్ పూర్ ఏరియా సింగరేణి ఓపెన్ కాస్ట్ గని జివిఆర్ కంపెనీ లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శ్రీరామ్ పూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వీ సూర్యనారాయణ కు వినతి పత్రాన్ని జేఏసీ నాయకులు అందజేశారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు అఫ్రోజ్ ఖాన్, దూలం శ్రీనివాస్, కొండపర్తి శంకర్, అగ్గు మల్లేష్ మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలో జివిఆర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయుకులు డిమాండ్ చేశారు.జివిఆర్ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చట్టం ప్రకారం అర్హులందరికీ బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించి అంద జేయాలన్నారు.

అకారణంగా విధుల నుంచి తొలగించిన కాంట్రాక్టు కార్మికు లందరిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సింగరేణిలో ఇతర ఓబీలలో ఇచ్చే మాదిరిగా అలవెన్స్లు, జీతాలు, ప్రోత్సహకాలను సైతం ఇవ్వాలన్నారు. భూ నిర్వాసితుల చట్టం ప్రకారం స్థానికులకు 80%, ఇతరులకు 20% ఉద్యోగాలను కేటాయించి వర్కర్లుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసారు. జాతీయ పండుగలకు కూడా వేతనంతో కూడిన మస్టర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చక్రవర్తి, పవన్, మల్లేష్, ప్రసాద్, ప్రశాంత్, సాగర్, మొండయ్య, వంశీ, రవి, కృష్ణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *