కోల్ బెల్ట్ ప్రతినిధి:
ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలకు రక్షణగా పోలీస్ శాఖ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తుంది. అంతేగాని ప్రజాప్రతినిధులతో ప్రజల సమక్షంలో అతి చనువుగా ఉండరాదు.ఆలా ఉంటె చూసే ప్రజలకు ఇబ్బందే అవుతుంది.పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కొందరి ప్రవర్తన, వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వారిపై కేసులు నమోదవు తున్నాయి.
హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి పార్టీ నుంచి మాధవీలత పోటీచేస్తున్నారు.తన ప్రచారంలో భాగంగా మాధవీలత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.ఆమె ప్రచారానికి వచ్చిన నేపథ్యంలో అక్కడే సెక్యూరిటీ విధులు ASI ఉమాదేవి నిర్వహిస్తోంది. విధి రాత కావచ్చు. ఆ అధికారి వెంటనే వెళ్లి బిజెపి మాదవి లతను ఆలింగనం చేసుకోంది.ఉద్యోగానికి మంగళం పడింది.మాధవిలతను హాగ్ చేసుకున్న దృశ్యాలు మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఉమాదేవి ని సస్పెండ్ చేశారు.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-