Home » Election Commission : తోక జాడిస్తే కత్తిరించుడే

Election Commission : తోక జాడిస్తే కత్తిరించుడే

Election Commission : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జూన్ నాలుగున ఫలితాలు రానున్నాయి. పోలైన ఓట్లను లెక్కించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. మే 13 న పోలింగ్ ఏ విదంగా జరిగిందో ఎన్నికల కమిషన్ గమనించింది. ఓట్ల లెక్కింపు రోజు కూడా ఏమి జరగనుందో కమిషన్ ముందే పసిగట్టింది. అందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటోంది. ఇప్పటి వరకు రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో కూడా కమిషన్ అలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదు. కనీవినీ ఎరుగని రీతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. కమిషన్ సూచనతో 20 కంపనీల పోలీస్ బలగాలను కేంద్ర ప్రభుత్వం ఏపీలో దించింది. లెక్కింపు రోజు ఏ నాయకుడైన అల్లర్లకు పాల్పడటానికి తోక జాడిస్తే కత్తిరించడానికి ఎన్నికల కమిషన్ సిద్దమయినది.

పోలింగ్ రోజు జరిగిన దాడులకు ఎన్నికల కమిషన్ వైఫల్యమే కారణమనే నిందను ఎత్తుకొంది. జరిగిన నష్టంకు కమిషన్ భాద్యత వహించాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 20 కంపనీల పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది కమిషన్. పోలింగ్ రోజు అల్లర్లకు పాల్పడిన వారికి లెక్కింపు రోజు ఏజెంట్లుగా నియమించొద్దని కమిషన్ ఈ పాటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అనుమానిత నాయకులను కూడా లెక్కింపు కేంద్రాలకు రాకుండా నిరోదించింది. ప్రతి లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీలకు అండగా ఉంటున్న సోషల్ మీడియా పై కూడా ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. గెలిచిన అభ్యర్థులతో పాటు వారి కార్యకర్తలు, నాయకులు కూడా సంబరాలకు, ర్యాలీలకు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.

ప్రతి జిల్లా కేంద్రానికి ఒక పోలీస్ ఉన్నతాధికారిని ప్రత్యేకంగా నియమించింది కమిషన్. రాష్ట్రంలోని మండల,మున్సిపాల్టీ, జిల్లా కేంద్రాల్లో కార్దన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అనుమానితుల ఇళ్లను తనిఖీ చేస్తున్నారు. 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో తమదయిన శైలిలో పోలీస్ బలగాలు చర్యలు తీసుకుంటున్నాయి. అల్లర్లు సృష్టిస్తారనే అనుమానం ఉన్న నాయకుల ఇళ్ల చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డి లను గృహనిర్బంధంలో ఉంచి, వారి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. జూన్ 19 తేదీ వరకు పోలీస్ బలగాలు రాష్ట్రంలోనే ఉండే విదంగా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ భారీ త్తున బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం విశేషం.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *