NIGAMA MEDIA (P) LTD
11.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, November 12, 2026

ఆర్మూర్‌లో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం ప్రారంభం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

జనవరి 4 వరకు కొనసాగనున్న అన్న ప్రసాద వితరణ
సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి
కోల్ బెల్ట్ న్యూస్(ఆర్మూర్):

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప దేవాలయంలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం ప్రారంభమైంది. ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అన్నదాన కార్యక్రమం నేటి నుంచి జనవరి 4వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది.

ఈ సందర్భంగా ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి మాట్లాడుతూ… అయ్యప్ప మాలధారణ చేసి స్వామి శరణు ఘోషతో దీక్షను కొనసాగిస్తున్న స్వాములకు ప్రతిరోజూ అన్న ప్రసాదాన్ని అందించేందుకు నిత్యాన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు సమర్పించే అన్నదానం, సేవా కార్యక్రమాలు అయ్యప్ప స్వామి అనుగ్రహానికి పాత్రం చేస్తాయని పేర్కొన్నారు. నిత్యాన్నదాన కార్యక్రమం తొలిరోజు గోవింద్‌పేట్‌కు చెందిన ఆనంద్‌రెడ్డి అన్న వితరణ దాతగా వ్యవహరించి అయ్యప్ప స్వాములకు భోజన ఏర్పాట్లు చేశారు. తొలి రోజు అన్నవితరణ కార్యక్రమాన్ని నగేష్ శర్మ గురుస్వామి కన్నెస్వాములతో కలిసి మెట్ల పూజ నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు.

ఈ సందర్భంగా సుమారు 130 మంది అయ్యప్ప స్వాములు, 100 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. అయ్యప్ప స్వాములకు అన్న వితరణ చేయదలచిన దాతలు ముందుకు వచ్చి సేవా సమితి సభ్యులను సంప్రదించాలని అధ్యక్షులు పుట్టి మురళి కోరారు. కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి కార్యదర్శి మీసాల రవి, కోశాధికారి గాజారెడ్డి నర్సారెడ్డి, గౌరవ అధ్యక్షులు జనార్దన్ గౌడ్, సేవా సమితి సలహాదారులు, సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.