NIGAMA MEDIA (P) LTD
10.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, October 18, 2026

విద్యుత్ సరఫరా లేక ఎండిపోతున్న పంటలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కొల్లూరు, ఉప్పరపల్లిలో రైతుల పొలాల పరిశీలన
తెలంగాణ రక్షణ సేన నేత సలేంద్ర కొమురయ్య యాదవ్

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల మండలం కొల్లూరు, ఉప్పరపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతుండటంతో తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆయా గ్రామాల్లోని రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. పంటల పరిస్థితిని పరిశీలించి, రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు చేగొండ రవి, నారెండ్ల ఆది రెడ్డి, ఎండీ అమీర్, కనుకుంట్ల ధర్మయ్య, మేకల శ్రీనివాస్, మేకల రమేష్, బైరి పెద్దకుమార్‌ల వ్యవసాయ పొలాలను పరిశీలించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలకు సాగునీరు అందక, ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సలేంద్ర కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ, రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్ల పంటలు నష్టపోయిన రైతుల పొలాలను అధికారులు తక్షణమే పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయాలని అన్నారు. అర్హులైన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అంతరాయాలకు గల కారణాలను గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. రైతులకు సాగునీరు అందక పంటలు నష్టపోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని, తక్షణమే స్పందించి రైతులకు అండగా నిలవాలని సలేంద్ర కొమురయ్య యాదవ్ పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాడుతుందని, వారికి న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన నిలుస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బొంగోని శంకరయ్య గౌడ్, ఎంచెర్ల స్వామి, బొడిగ మహేష్, బొల్లబత్తుల భూమయ్య, ఎం. శ్రీనివాస్, ఎన్. రాజ్‌కుమార్, కే. రమేష్, రాజమల్లు, పెగడ సది తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.