విద్యుత్ సరఫరా లేక ఎండిపోతున్న పంటలు
కొల్లూరు, ఉప్పరపల్లిలో రైతుల పొలాల పరిశీలన తెలంగాణ రక్షణ సేన నేత సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల మండలం కొల్లూరు, ఉప్పరపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతుండటంతో తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆయా గ్రామాల్లోని రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. పంటల పరిస్థితిని పరిశీలించి, రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు చేగొండ రవి, నారెండ్ల ఆది రెడ్డి,...