Home » వాట్సాప్‌ కొత్త చీఫ్ ఎవరంటే …

వాట్సాప్‌ కొత్త చీఫ్ ఎవరంటే …

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ అయిన వాట్స్ అప్ నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. గత ఏడు సంవత్సరాలుగా వాట్సాప్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన విల్ క్యాత్‌కార్ట్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ప్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో భారతీయ ఫిన్‌టెక్ సంస్థ క్రేడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా వాట్సాప్ తదుపరి గ్లోబల్ హెడ్‌గా నియమితులయ్యారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన వాట్సాప్‌కు నాయకత్వం వహించే తొలి ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్తగా కునాల్ షా నిలిచారు.

వాట్సాప్‌ను మూడు బిలియన్లకు పైగా వినియోగదారుల స్థాయికి చేర్చడంలో విల్ క్యాత్‌కార్ట్ కీలక పాత్ర పోషించగా, ఇకపై ఆయన మెటాలో కొత్త ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు. మరోవైపు, కునాల్ షా తన సీఈఓ బాధ్యతలకు వీడ్కోలు చెప్పి వాట్సాప్ గ్లోబల్ కార్యకలాపాలకు నాయకత్వం వహించనున్నారు. ఈ నియామకం అంతర్జాతీయ టెక్ రంగంలో విశేష చర్చకు దారితీస్తూ, భారతీయ ప్రతిభకు మరో గ్లోబల్ గుర్తింపుగా నిలుస్తోంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *