Court : తెలంగాణాలో బిఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బిఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్ గురువారం తన తీర్పును ప్రకటించింది.
కోర్టు తీర్పు వచ్చిన మూడు నెలల్లోగా స్పీకర్ తన నిర్ణయం తీసుకోవాలి.
స్పీకర్ నిర్ణయం మూడు నెలలకు మించకుండా ఉండాలి
న్యాయస్థానమే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న బిఆర్ఎస్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
” operation success but patient ded ” అనే సూత్రం అమలుచేయరాదంది సుప్రీంకోర్టు
ఈ విషయంపై హై కోర్ట్ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్ట్ కొట్టివేసింది.
…….. సుప్రీం కోర్ట్ తీర్పు వెలువడిన నేపథ్యంలో తెలంగాణ శాసన సభ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే…..