Telangana : తెలంగాణ రాజకీయ చదరంగంలో సినిమా డైలాగులు వినబడుతున్నాయి. మొన్నటివరకు ఏపీ రాజకీయాల్లో పుష్ప సినిమా డైలాగు వినిపించింది. ఇప్పుడు ఆ సినిమా డైలాగ్ తెలంగాణ రాజకీయాల్లో వినబడుతోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాట్లాడిన డైలాగులు రెండు రాష్ట్రాల్లో పెద్ద ట్రెండింగ్ అయ్యింది.
ఇటీవల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పల్నాడు లో పర్యటించారు. అక్కడ కార్యకర్తలు ప్లకార్డు లు పట్టుకొని నినాదాలు చేశారు. సాధరణంగా ఎప్పుడు జై కొడుతూ నినాదాలు చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ రప్పా రప్పా అంటూ నరికేస్తాం అని ప్లకార్డులు పట్టుకొని వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఇప్పుడు ఆ నినాదాలు తెలంగాణలో వినబడుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావ్ రైతు సదస్సు పురస్కరించుకొని పటాన్ చెరువు నియోజకవర్గం పర్యటనకు వెళ్లారు. అక్కడ గులాబీ శ్రేణులు ” రప్పా రప్పా….2029లో అధికారం మనదే ” అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఇప్పుడు ఆ సంఘటన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. పుష్ప సినిమా డైలాగ్ ఏపీ నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి అంటువ్యాధిలా సోకిందనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.