Ice cream : వేసవి కాలం వచ్చిందంటే చల్లని పదార్థాలు తినాలనిపిస్తుంది. దాహం తీరడానికి కొందరు చల్లని నీరు తాగుతారు. మరికొందరు చల్లని జ్యుస్ తాగుతారు. ఇంకా చెప్పాలంటే ఐస్ క్రీం తింటారు. చల్లని ఐస్ క్రీం శరీరంలోని వేడిని చల్లారిస్తుందా ? దాహాన్ని తీరుస్తుందా ? అనే విషయాలను ఆరోగ్య నిపుణులు ఈ విధంగా చెబుతున్నారు.
ఐస్ క్రీం తింటే కాసేపు చల్లగా అనిపించవచ్చు. కానీ అది శరీరాన్ని పూర్తిగా చల్లబరచదు. ఐస్ క్రీం తినడం వల్ల నోటిలో తాత్కాలిక చల్లదనం అనుభవించవచ్చు. ఒక చెంచా ఐస్ క్రీం నోట్లో వేసుకున్న వెంటనే చల్లదనాన్ని అనుభవిస్తాం. తాత్కాలికంగా చల్లబడ్డ అనుభూతి కలుగుతుంది. ఐస్ క్రీం
ఐస్ క్రీం తక్కువ ఉష్ణోగ్రతలో ఉండటంతో సంభవిస్తుంది. శరీర మొత్తం ఉష్ణోగ్రతను తగ్గించే స్థాయిలో ఇది పనిచేయదు. శరీరం చల్లని పదార్థాన్ని తీసుకున్నప్పుడు కోర్ ఉష్ణోగ్రత తక్కువగా తగ్గకుండా నియంత్రించేందుకు మాత్రమే ప్రయత్నిస్తుంది. కాబట్టి ఐస్ క్రీం తిన్నప్పుడు మాత్రమే నోటి వరకు మాత్రమే చల్లదనం ఏర్పడుతుంది. శరీరంలో చల్లదనం ఏర్పడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.