TDP : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీల పని తీరు ఎలా ఉంది అనే అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు తెప్పించుకున్నది ఎమ్మెల్యేల పనితీరు నివేదిక కాదు… ప్రోగ్రెస్ కార్డు అంటే సరిపోతుంది.
చంద్రబాబు రాష్ట్రము విడిపోయిన తరువాత మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో పార్టీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ ఇబ్బందుల పాలయ్యింది. కార్యకర్తలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితుల వలన పార్టీ ఓటమి పాలైనది. అదే విదంగా వైఎస్ జగన్ కూడా ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. వైఎస్సార్ సిపి పరిస్థితి కూడ జగన్ చేష్టల వలన కుడితిలో పడ్డ ఎలుకలా తయారైనది. దింతో పార్టీ అధికారానికి రెండోసారి దూరమైనది.
ఈ పరిస్థితులను గమనించిన చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరు గడిచిన ఆరు నెలల్లో ఎలా ఉంది అనే సమాచారాన్ని తెప్పించు కుంటున్నారు. ఇచ్చిన హామీలు ఏ మేరకు ప్రజలకు చేరువయ్యాయి. హామీలు ఎక్కడెక్కడ అమలు కాలేదు. ఇందుకు కారణం ఎమ్మెల్యేలా ? పార్టీ నాయకత్వమా ? అనే అంశాలపై పరిశీలన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పలువురి ఎమ్మెల్యేలల్లో వణుకు మొదలైనదని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.