pavan kalyan : ఏపీ లోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. ఆ తరువాత నిర్మాణమైన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా భాద్యతలు చేపట్టారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో తీరిక లేకుండా ఉన్నారు. దింతో సినిమాలకు దూరంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో తన నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధి పై దృష్టి సారించారు. ఇప్పటికే తన నియోజకవర్గానికి వరాలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా మరో కానుక ఇస్తున్నట్టుగా ప్రకటించారు.
పిఠాపురంలో వంద పడకల సామర్ధ్యం గల ఆసుపత్రిని నిర్మిస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు వంద పడకల ఆసుపత్రిగా ప్రస్తుత ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నియోజక వర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రి అభివృద్ధి కోసం రూ.38.32 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో ప్రత్యేక భవనాలు, ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, కావలసిన ప్రత్యేకమైన సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ విభాగాలకు చెందిన 66 మంది వైద్యులతో పాటు నర్సులు, వైద్య సిబ్బందిని నియమించనున్నారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో నియోజక వర్గం ప్రజలకు మెరుగయిన వైద్యం అందుబాటులోకి రానుంది.