Allu Arjun : పుష్ప-2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. అల్లు అర్జున్ న్యాయవాది వేసిన క్యాష్ పిటిషన్ ను హై కోర్ట్ విచారించిది. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
ఇద్దరు న్యాయవాదులు సుమారు గంటన్నర పాటు తమ వాదనలు వినిపించారు. అనంతరం హై కోర్ట్ మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తిస్థాయి బెయిల్ కోసం నాంపల్లి కోర్ట్ కు వెళ్లాలని హై కోర్ట్ సూచించింది. కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దింతో అల్లు అర్జున్ ను పోలీసులు చంచల్ గూడ జైలు కు తరలించారు.
ఇంతలోనే అల్లు అర్జున్ కు హై కోర్ట్ నుంచి బెయిల్ ఆదేశాలు జారీ అయ్యాయి. బెయిల్ పేపర్లు చెంచల్ గూడ జైలు అధికారులకు అందజేసిన తరువాతనే అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.