Home » Thirumala : భక్తులకు కోరినంత స్వామి ప్రసాదం

Thirumala : భక్తులకు కోరినంత స్వామి ప్రసాదం

Thirumala : తిరుమలలో ఏడుకొండలపై వెలసిన వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు వేయి కళ్ళతో ఎదురుచూస్తారు. స్వామి వారి దర్శనం తమ అదృష్టంగా భావిస్తారు. దర్శనం అనంతరం తిరుమల-తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం కొనుగోలు చేస్తారు. ఆ ప్రసాదాన్ని తన బందువులకు, స్నేహితులకు పంపిణి చేసి ఆనందపడుతారు భక్తులు. భక్తులు ఆశించినంత లడ్డు ప్రసాదం కొనడానికి దొరికేది కాదు.

లడ్డు ప్రసాదం ఆశించినంత దొరకకపోవడంతో భక్తుల్లో అసంతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో దర్శనం చేసుకున్న భక్తులను సంతృప్తి పరచడానికి కోరినన్ని లడ్డూలు ఇవ్వడానికి టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకొంది. దర్శనం చేసుకున్న తరువాత భక్తుల సంఖ్యకు సరిపడే విదంగా లడ్డూలను తయారు చేయించడానికి టీటీడీ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

వెంకన్న స్వామిని దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఉచితంగా ఇస్తున్నారు. ఈ విదంగా ప్రతిరోజు భక్తులకు సుమారు 75 వేల లడ్డూలను అందజేస్తున్నారు. లడ్డూలతో పాటు అదనంగా సుమారు 4 వేల వడలను కూడా తయారు చేస్తున్నారు. లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడానికి ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరికొందరిని నియమించారు. కొత్తగా 74 మంది

శ్రీవైష్ణవులతోపాటు, 10 మంది శ్రీవైష్ణవేతరులను లడ్డు తయారీ కోసం నియమించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకోవడం విశేషం. కోరినన్ని లడ్డూలను ఇవ్వడానికి టీటీడీ నిర్ణయం తీసుకోవడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *