Hanman : హనుమంతుడికి ప్రతి హిందూ కుటుంబం భక్తులే. ప్రతి మంగళ వారం హనుమాన్ దేవాలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. కొందరు మంగళవారం ఉపవాసం ఉంటారు. నెలరోజుల పాటు దీక్షతో ఉంటారు. కొందరు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదివి తమ భక్తిని చాటుకుంటారు. అయితే ఏడాదికి రెండుసార్లు హనుమాన్ జయంతి వస్తుంది. ఇలా రెండు సార్లు ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం……
సుందరకాండ లో వివరించిన ప్రకారం సీతా దేవిని ఎవరూ లేని సమయంలో వచ్చి రావణాసురుడు అపహరించుకు పోతాడు. అప్పుడు సీతాదేవిని వెతకడానికి హనుమంతుడు లంకకు బయలుదేరుతాడు. లంకలోని అశోక వనంలో సీతాదేవిని గుర్తిస్తాడు. ఆమెను కనుగొన్న రోజు చైత్రమాసం, చిత్తా నక్షత్రం, పౌర్ణమి. ఆ రోజున సీతాదేవిని కనుగొన్న ఆనందంలో లంకను దహనం చేస్తాడు హనుమంతుడు. హనుమంతుడు రావణాసురిడి సైన్యం పై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్ర సుద్ద పౌర్ణమి రోజును కొందరు భక్తులు హనుమాన్ జయంతిగా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 12న హనుమాన్ జయంతిని పలువురు జరుపుకుంటున్నారు.
వాస్తవానికి హనుమాన్ జయంతి వైశాఖ మాసం బహుళ పక్షములో వచ్చే దశిమి, పూర్వాభాద్ర నక్షత్రం రోజున నిర్వహించాలి. ఈ జయంతి సాధారణంగా ప్రతిఏటా మే నెల చివరి వారంలో లేదంటే, జూన్ మొదటి వారంలో వస్తుంది. వేదంలో చెప్పబడిన ప్రకారం అయితే మే, లేదా జూన్ నెలలో వచ్చేదే అసలైన హనుమాన్ జయంతి.