TTD : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం తిరుమల దేవస్థానం అభివృద్ధిపై దృష్టి సారించింది. భక్తులకు సరిపడ సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో తిరుమలకు వెళ్లిన భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం స్వామి ప్రసాదం కూడా లభించలేదు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన పొరపాట్లు జరుగకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు కొండపై అభివృద్ధి చేయడానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వం ఏర్పాటైన చైర్మన్ నియామకం చేపట్టారు. కొద్దిరోజులకే లడ్డు ప్రసాదం లో నెయ్యి నాణ్యత లో జరిగిన అవినీతిని వెలికితీశారు. అన్న ప్రసాదం మరింత నాణ్యత ఉండే విదంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా భక్తులకు సరిపడేవిదంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల అభివృద్ధి కోసం 2019 లో మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. కానీ ఆ ప్లాన్ సరిగా అమలు కాలేదు.
తిరుమల కొండపై పాదచారులకు సరిపడేంతగా ఫుట్పాత్ లు ఏర్పాటు చేయనున్నారు. భక్తుల రద్దీ అనుగుణంగా కొత్తగా గదులను నిర్మించడానికి ప్రణాళిక రూపొందించారు. పాత భవనాలను తొలగించి మరో 25 ఏళ్ల భవిష్యత్తు కు సరిపడే విదంగా కాటేజిలను నిర్మించడానికి టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకొంది. తిరుమల కొండపై పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని రాబోయే మూడు నెలల్లో తొలగించాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.